
షఫీఖ్, సుభాష్‌లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన షూటర్లు వికార్ అహ్మద్ షఫీఖ్, సుభాష్ చింతల్‌పాటి సత్తా చాటారు. గచ్చిబౌలిలోని శాట్స్ షూటిం గ్ రేంజ్‌లో జరిగిన పోటీల్లో స్కీట్ పురుషుల విభాగంలో షఫీఖ్ 69 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గుస్తీ నోరి యా(68 పా.), సుభాష్ చింతలపాటి (63 పా.) వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. స్కీట్ జూనియర్ పురుషుల విభాగంలో సుభాష్(63 పా.), మునెక్ బత్తుల (53 పా.), విరాజ్(40 పా.) వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచారు. జూనియర్ మహిళల విభాగంలో ఎన్. సొనాలి రాజు 50 పాయింట్లు స్కోర్ చేసి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ షూటింగ్ టోర్నీ ఫలితాలు
రైఫిల్ ఈవెంట్: 1. రాజేంద్ర ప్రసాద్(56 పా.), 2. చక్రవర్తి(47 పా.), 3. మౌక్తిక్ కిరణ్‌రెడ్డి(46 పా.).