షేర్‌వుడ్‌ పబ్లిక్‌ స్కూల్‌కు టైటిల్‌ | sherwood public school gets title | Sakshi
Sakshi News home page

షేర్‌వుడ్‌ పబ్లిక్‌ స్కూల్‌కు టైటిల్‌

Published Thu, Aug 24 2017 12:49 PM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM

షేర్‌వుడ్‌ పబ్లిక్‌ స్కూల్‌కు టైటిల్‌ - Sakshi

షేర్‌వుడ్‌ పబ్లిక్‌ స్కూల్‌కు టైటిల్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రీజియన్‌ ఐసీఎస్‌ఈ–ఐఎస్‌సీ స్కూల్స్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో షేర్‌వుడ్‌ పబ్లిక్‌ స్కూల్‌ బాలికల జట్టు వాలీబాల్‌లో విజేతగా నిలిచింది. పేట్‌ బషీరాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో బుధవారం జరిగిన సీనియర్‌ బాలికల ఫైనల్లో షేర్‌వుడ్‌ జట్టు 27–25, 25–17తో హెచ్‌పీఎస్‌ బేగంపేట్‌ జట్టుపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో అభ్యాస స్కూల్‌ 25–6, 25–9తో సెయింట్‌ జోసెఫ్‌ (కింగ్‌కోఠి)పై గెలుపొందింది.

 

అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో షేర్‌వుడ్‌ 25–13, 25–11తో సెయింట్‌ జోసెఫ్‌పై, హెచ్‌పీఎస్‌ 25–20, 25–8తో అభ్యాస స్కూల్‌పై విజయం సాధించాయి. మరోవైపు జూనియర్‌ బాలికల విభాగంలో సెయింట్‌ జోసెఫ్‌ (మలక్‌పేట్‌), సుజాత పబ్లిక్‌ స్కూల్, సెయింట్‌ జోసెఫ్‌ (హబ్సిగూడ), అభ్యాస స్కూల్‌ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. క్వార్టర్‌ మ్యాచ్‌ల్లో సుజాత స్కూల్‌ 25–17, 25–13తో ఫ్యూచర్‌ కిడ్స్‌పై, అభ్యాస 25–17, 25–20తో హెచ్‌పీఎస్‌పై, సెయింట్‌ జోసెఫ్‌ 25–14, 25–9తో సెయింట్‌ ఆన్స్‌పై, సెయింట్‌ జోసెఫ్‌ 25–20, 27–25తో షేర్‌వుడ్‌ పబ్లిక్‌ స్కూల్‌ జట్లపై గెలుపొందాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement