
డబ్బు అలా మాట్లాడిస్తోంది...
తాము క్రికెట్ ఆడే రోజుల్లో దూషణలకు దిగిన షోయబ్ అక్తర్ లాంటి వాళ్లు ఇప్పుడు వ్యాఖ్యాతలుగా మారి భారత క్రికెటర్లను ప్రశంసిస్తున్నారని... డబ్బు వారితో అలా మాట్లాడిస్తోందని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ‘పాకిస్తాన్ మాజీ క్రికెటర్లందరికీ భారత క్రికెట్‌లో ఉన్న డబ్బు గురించి తెలుసు. మన గురించి బాగా మాట్లాడితే ఏదో ఒక టీవీ చానెల్‌లో అవకాశం వస్తుంది. ఇదంతా డబ్బు మహత్యం’ అని సెహ్వాగ్ అన్నాడు.