న్యూఢిల్లీ: ఐటీఎఫ్ ఫ్యూచర్ టోర్నీలో భారత టెన్నిస్ ప్లేయర్ సనమ్ సింగ్ సత్తా చాటాడు. కెనడాలోని టొరంటోలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత డేవిస్ కప్ ప్లేయర్ సనమ్ పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు... డబుల్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు.
రెండో రౌండ్లో రెండోసీడ్ సనమ్ 6-4, 7-6 (7/0)తో ఇవాన్ కింగ్ (అమెరికా)పై నెగ్గాడు. విజయంత్ మాలిక్‌తో కలిసి డబుల్స్‌లో బరిలోకి దిగిన సనమ్... క్వార్టర్ఫైనల్లో 6-1, 3-6, 11-9తో అమెరికా జోడి సికో బంగౌరా-క్విగ్లిపై గెలుపొందాడు. తదుపరి రౌండ్లో భారత జోడి... అమెరికా ద్వయం జాసన్-ఇవాన్లతో తలపడుతుంది.
సెమీస్‌లో సనమ్ జోడి
Published Fri, Sep 13 2013 1:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement