
గుర్బాజ్‌పై వేటు
న్యూఢిల్లీ: సీనియర్ హాకీ ఆటగాడు గుర్బాజ్ సింగ్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించారు. జట్టులో విభేదాలు సృష్టిస్తుండడంతో పాటు తనలో క్రమశిక్షణ లేదని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ అనంతరం హెచ్‌ఐకి సమర్పించిన నివేదికలో గుర్బాజ్‌పై ఈమేరకు ఫిర్యాదు అందింది. సోమవారం హర్బీందర్ సింగ్ నేతృత్వంలోని హెచ్‌ఐ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది.
అయితే ఈ వేటుపై గుర్బాజ్ నెలరోజుల్లో హెచ్‌ఐ అప్పీలెట్ ట్రి బ్యునల్‌కు వెళ్లే అవకాశం ఉంది. ‘నేటి నుంచి తొమ్మిది నెలల పాటు గుర్బాజ్‌ను సస్పెండ్ చేస్తున్నాం. దీంతో 2016, మే 9 వరకు అతడు భారత జట్టుకు ఆడలేడు. జూడ్ ఫెలిక్స్ అందించిన నివేదికను అనుసరించి మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని హర్బీందర్ తెలిపారు. గతంలో కోచ్‌గా పనిచేసిన మైకేల్ నాబ్స్‌తో కూడా గొడవ పడి లండన్ ఒలింపిక్స్ అనంతరం కొద్ది కాలం గుర్బాజ్ సస్పెండ్‌కు గురయ్యాడు.