Gurbaj Singh
-
గుర్బాజ్ సింగ్‌కు రూ.67 లక్షలు
న్యూఢిల్లీ: క్రమశిక్షణారాహిత్యంతో దాదాపు ఏడాది కాలంగా భారత జట్టుకు దూరమైనా... మిడ్‌ఫీల్డర్ గుర్బాజ్ సింగ్ హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వేలంలో తన ప్రత్యేకత నిలబెట్టుకున్నాడు. బుధవారం జరిగిన వేలంలో రాంచీ రేస్ జట్టు గుర్బాజ్‌ను 99 వేల డాలర్లకు (సుమారు రూ. 67 లక్షలు) సొంతం చేసుకుంది. 2017 సీజన్ కోసం ఈ వేలం జరిగింది. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లూ దాదాపుగా తమ వద్ద ఉన్న ఆటగాళ్లనే కొనసాగించాలని నిర్ణయించున్నాయి. దాంతో ప్రధాన ఆటగాళ్లు పోగా... మిగిలిన కొన్ని ఖాళీల కోసం ఈ వేలంను నిర్వహించారు. గుర్బాజ్ తర్వాత 75 వేల డాలర్లతో (రూ. 51 లక్షలు) జర్మనీ ఫార్వర్డ్ క్రిస్టోఫర్ రూర్ రెండో స్థానంలో నిలిచాడు. అతడిని కూడా రాంచీ జట్టు ఎంచుకుంది. భారత యువ ఆటగాళ్లలో 18 ఏళ్ల హార్దిక్ సింగ్‌ను పంజాబ్ జట్టు 39 వేల డాలర్లకు (రూ. 27 లక్షలు) తీసుకోవడం విశేషం. -
గుర్బాజ్‌పై వేటు
న్యూఢిల్లీ: సీనియర్ హాకీ ఆటగాడు గుర్బాజ్ సింగ్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించారు. జట్టులో విభేదాలు సృష్టిస్తుండడంతో పాటు తనలో క్రమశిక్షణ లేదని హాకీ ఇండియా (హెచ్ఐ) ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ అనంతరం హెచ్‌ఐకి సమర్పించిన నివేదికలో గుర్బాజ్‌పై ఈమేరకు ఫిర్యాదు అందింది. సోమవారం హర్బీందర్ సింగ్ నేతృత్వంలోని హెచ్ఐ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. అయితే ఈ వేటుపై గుర్బాజ్ నెలరోజుల్లో హెచ్ఐ అప్పీలెట్ ట్రి బ్యునల్‌కు వెళ్లే అవకాశం ఉంది. ‘నేటి నుంచి తొమ్మిది నెలల పాటు గుర్బాజ్‌ను సస్పెండ్ చేస్తున్నాం. దీంతో 2016, మే 9 వరకు అతడు భారత జట్టుకు ఆడలేడు. జూడ్ ఫెలిక్స్ అందించిన నివేదికను అనుసరించి మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని హర్బీందర్ తెలిపారు. గతంలో కోచ్‌గా పనిచేసిన మైకేల్ నాబ్స్‌తో కూడా గొడవ పడి లండన్ ఒలింపిక్స్ అనంతరం కొద్ది కాలం గుర్బాజ్ సస్పెండ్‌కు గురయ్యాడు.