
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్ మళ్లీ ఓడింది. నిరాశాజనక ప్రదర్శనతో 13వ పరాజయాన్ని చవిచూసింది. జోన్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కుమార్ (17 పాయింట్లు) రాణించడంతో బెంగళూరు బుల్స్ 45–35 స్కోరుతో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. 18 మ్యాచ్‌లాడిన బుల్స్‌కు ఇది ఐదో విజయం. రోహిత్ రైడింగ్‌లో కదం తొక్కాడు. 24 సార్లు కూతకు వెళ్లిన అతను 17 పాయింట్లు తెచ్చిపెట్టాడు.
తమిళ్ తలైవాస్ తరఫున స్టార్ రైడర్ అజయ్ ఠాకూర్ (15) మరోసారి తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో గుజరాత్ జెయింట్స్, పుణేరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment