క్వార్టర్స్‌లో ఓడిన తెలంగాణ | telangana defeated in quarter final of tennikoit | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో ఓడిన తెలంగాణ

Published Sun, Feb 5 2017 11:04 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

telangana defeated in quarter final of tennikoit

సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఈ టోర్నీలో తెలంగాణ పోరాటం ముగిసింది. పాండిచ్చేరితో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో 3-0తో రాష్ట్ర జట్టు పరాజయం పాలైంది.

 

తొలి సింగిల్స్ మ్యాచ్‌లో రాజశేఖరన్ (పాండిచ్చేరి) 21-19, 19-21, 21-18తో తేజరాజ్ (తెలంగాణ)పై గెలుపొందగా... రెండో సింగిల్స్ మ్యాచ్‌లో దేవరాజు (పాండిచ్చేరి) 21-12, 21-9తో జంబంక్ (తెలంగాణ)పై నెగ్గాడు. డబుల్స్ మ్యాచ్‌లోనూ తేజరాజ్-ప్రభుదాస్ (తెలంగాణ) ద్వయం 14-21, 15-21తో రాజశేఖరన్-దేవరాజు జంట చేతిలో ఓడిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement