tennikoit
-
టెన్నికాయిట్ చాంప్ నిజాం కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజి పురుషుల టెన్నికాయిట్ టోర్నమెంట్లో నిజాం కాలేజి జట్టు విజేతగా నిలిచింది. ఉస్మానియా ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలోని టెన్నికాయిట్ కోర్టులో ఈ పోటీలు నిర్వహించారు. ఫైనల్లో నిజాం కాలేజి 2–1 స్కోరుతో డా. బీఆర్ అంబేడ్కర్ డిగ్రీ కాలేజి జట్టుపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఓయూ టెక్నా లజీ జట్టు 2–0తో భవన్స్ సైనిక్‌పురిపై నెగ్గింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ పోటీల్లో నిజాం కాలేజి 2–0తో ఓయూ టెక్నాలజీపై గెలుపొందగా, బీఆర్ అంబేడ్కర్ కాలే జి జట్టు 2–0తో భవన్స్ సైనిక్‌పురిపై విజ యం సాధించింది. లీగ్ దశలో ఓయూ టెక్నా లజీ జట్టు 2–0తో ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజిపై, బీఆర్ అంబేడ్కర్ కాలేజి 2–1తో ఓయూ ఆర్ట్స్ కాలేజిపై, నిజాం కాలేజి 2–0తో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ (సైఫాబాద్)పై గెలుపొందాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కార్యదర్శి ప్రొఫె సర్ బి.సునీల్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చే సి బహుమతులు అందజేశారు. ఇందులో టెన్నికాయిట్ కోచ్ సద్గురు, ప్రొఫెసర్ దీప్లా, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటప్ప పాల్గొన్నారు. -
సెమీస్‌లో ఓడిన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టుకు నిరాశ ఎదురైంది. గౌలిపురాలో జరుగుతోన్న ఈ టోర్నీ టీమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. ఆదివారం జరిగిన తొలి సెమీస్ మ్యాచ్‌లో తెలంగాణ 1-3 తేడాతో కేరళ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రియాంక (తెలంగాణ) 19-21, 11-21తో జూజి అన్నా జోహా (కేరళ) చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్ మ్యాచ్‌లో శిరీష (తెలంగాణ) 21-18, 21-10తో పార్వతి (కేరళ)పై గెలిచి తెలంగాణను రేసులో ఉంచింది. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ మన క్రీడాకారిణులు ఓడిపోవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. మరో సెమీస్ మ్యాచ్‌లో తమిళనాడు 3-2తో కర్ణాటక జట్టుపై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. -
క్వార్టర్స్‌లో ఓడిన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఈ టోర్నీలో తెలంగాణ పోరాటం ముగిసింది. పాండిచ్చేరితో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో 3-0తో రాష్ట్ర జట్టు పరాజయం పాలైంది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో రాజశేఖరన్ (పాండిచ్చేరి) 21-19, 19-21, 21-18తో తేజరాజ్ (తెలంగాణ)పై గెలుపొందగా... రెండో సింగిల్స్ మ్యాచ్‌లో దేవరాజు (పాండిచ్చేరి) 21-12, 21-9తో జంబంక్ (తెలంగాణ)పై నెగ్గాడు. డబుల్స్ మ్యాచ్‌లోనూ తేజరాజ్-ప్రభుదాస్ (తెలంగాణ) ద్వయం 14-21, 15-21తో రాజశేఖరన్-దేవరాజు జంట చేతిలో ఓడిపోయింది. -
రాష్ట్రస్థాయి ‘టెన్నికాయిట్’కు సంయుక్త
ఇంకొల్లు: రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు సంయుక్త ఎంపికైనట్లు టెన్నికాయిట్ సంఘం జిల్లా కార్యదర్శి పీ బాపూజి తెలిపారు. విజయనగం జిల్లా సీతానగరంలో శుక్రవారం నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఆమె హాజరైంది. చందలూరు గ్రామానికి చెందిన సంయుక్త ఆదర్శ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతుంది. వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్‌కుమార్, పాఠశాల కరస్పాండెంట్ విజయభాస్కర్, ప్రిన్సిపాల్ సునీత సంయుక్తను అభినందించారు. -
జిల్లా టెన్నీకాయిట్ జట్లు ఇవే
నూజివీడు : టెన్నీకాయిట్ అండర్–14 జిల్లా బాల బాలికల జట్లను పట్టణంలోని ఎస్ఆర్ఆర్ హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన సెలక్షన్లో ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా టెన్నీకాయిట్ అసోసియేషన్ కార్యదర్శి డీ. సూర్యనారాయణ తెలిపారు. బాలుర జట్టు: జీ రమేష్, ఎన్. నవీన్, పీ. ఫణీంద్ర, ఎం. హరీష్, బీ. దుర్గారావు, పీ. కార్తీక్, కే తారక్, ఎం విశాల్. బాలికల జిల్లా జట్టుకు జీ. స్వాతి, జే. హరిణి, జే. రాజేశ్వరి, సీహెచ్. శ్రావణి, ఎం. సునంద, జీ. నిఖిత, యూ. ప్రవల్లిక, రవళి ఎంపికయ్యారు.