సెమీస్‌లో ఓడిన తెలంగాణ | telangana defeated in semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఓడిన తెలంగాణ

Published Mon, Feb 6 2017 8:15 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

telangana defeated in semis

సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టుకు నిరాశ ఎదురైంది. గౌలిపురాలో జరుగుతోన్న ఈ టోర్నీ టీమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. ఆదివారం జరిగిన తొలి సెమీస్ మ్యాచ్‌లో తెలంగాణ 1-3 తేడాతో కేరళ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రియాంక (తెలంగాణ) 19-21, 11-21తో జూజి అన్నా జోహా (కేరళ) చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్ మ్యాచ్‌లో శిరీష (తెలంగాణ) 21-18, 21-10తో పార్వతి (కేరళ)పై గెలిచి తెలంగాణను రేసులో ఉంచింది. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ మన క్రీడాకారిణులు ఓడిపోవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. మరో సెమీస్ మ్యాచ్‌లో తమిళనాడు 3-2తో కర్ణాటక జట్టుపై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement