సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజి పురుషుల టెన్నికాయిట్ టోర్నమెంట్‌లో నిజాం కాలేజి జట్టు విజేతగా నిలిచింది. ఉస్మానియా ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలోని టెన్నికాయిట్ కోర్టులో ఈ పోటీలు నిర్వహించారు. ఫైనల్లో నిజాం కాలేజి 2–1 స్కోరుతో డా. బీఆర్ అంబేడ్కర్ డిగ్రీ కాలేజి జట్టుపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఓయూ టెక్నా లజీ జట్టు 2–0తో భవన్స్ సైనిక్‌పురిపై నెగ్గింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ పోటీల్లో నిజాం కాలేజి 2–0తో ఓయూ టెక్నాలజీపై గెలుపొందగా, బీఆర్ అంబేడ్కర్ కాలే జి జట్టు 2–0తో భవన్స్ సైనిక్‌పురిపై విజ యం సాధించింది.
లీగ్ దశలో ఓయూ టెక్నా లజీ జట్టు 2–0తో ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజిపై, బీఆర్ అంబేడ్కర్ కాలేజి 2–1తో ఓయూ ఆర్ట్స్ కాలేజిపై, నిజాం కాలేజి 2–0తో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ (సైఫాబాద్)పై గెలుపొందాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కార్యదర్శి ప్రొఫె సర్ బి.సునీల్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చే సి బహుమతులు అందజేశారు. ఇందులో టెన్నికాయిట్ కోచ్ సద్గురు, ప్రొఫెసర్ దీప్లా, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment