
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు ఆకట్టుకుంది. గువాహటిలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఫాయిల్ ఈవెంట్ టీమ్ కేటగిరీలో కాంస్య పతకాన్ని సాధించింది. టి. భాగ్యశ్రీ,, శిరీష, ఫౌజియా, ప్రేరణ శీతల్‌లతో కూడిన తెలంగాణ బృందం పోటీల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి పతకాన్ని అందించిన క్రీడాకారులను శాట్స్ ఎండీ ఎ. దినకర్ బాబు అభినందించారు.
భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ‘శాట్స్’ ఫెన్సింగ్ కోచ్ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ జట్టు ఇటీవల జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లోనూ పతకాన్ని గెలుచుకుంది. ఈ నెల ఫిబ్రవరి 28 నుంచి మార్చి 8 వరకు జరుగనున్న ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారతజట్టుకు భాగ్యశ్రీ ఎంపికైంది. ఆమె ను దినకర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment