
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఫెన్సర్లు సత్తా చాటారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో రాష్ట్ర ఫెన్సింగ్ జట్టు రజత పతకం సాధించగా... వ్యక్తిగత విభాగంలో ఓ కాంస్యం దక్కింది. ఫాయిల్ టీమ్ విభాగంలో టి. భాగ్యశ్రీ, షేక్ ఫౌజియా, కె. గౌరి, శిరీషలతో కూడిన రాష్ట్ర జట్టు ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫాయిల్ వ్యక్తిగత విభాగంలో భాగ్యశ్రీ కాంస్య పతకం చేజిక్కించుకుంది.