తెలంగాణ జట్టుకు టైటిల్‌ | Telangana gets flag football title | Sakshi

తెలంగాణ జట్టుకు టైటిల్‌

Nov 6 2017 10:58 AM | Updated on Oct 2 2018 8:39 PM

 Telangana gets flag football title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయి ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా చాటింది. స్థానిక స్కైకింగ్స్‌ ఫుట్‌బాల్‌ అకాడమీలో జరిగిన ఈటోర్నీలో తెలంగాణ పురుషుల జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన టైటిల్‌పోరులో తెలంగాణ జట్టు 42–18 తేడాతో ఢిల్లీ జట్టుపై ఘనవిజయం సాధించింది.

అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ 30–24తో ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొందగా, ఢిల్లీ 24–06తో హరియాణాను ఓడించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో హరియాణా, ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొందింది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఓఓ సందీప్‌ చౌదరి, కార్యదర్శి నామ్‌దేవ్‌ శ్రీగోంకర్, ఉపాధ్యక్షులు మొవ్వ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement