telanganga
-
అర్హత లేకున్నా మిడ్ మానేరు పరిహారం
సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు పరిహారం చెల్లింపు విషయంలో అర్హత లేకపోయినా రాజ్యసభ సభ్యుడు జె. సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులకు సైతం ప్యాకేజీ కింద పరిహారం చెల్లించారని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఆ మేరకు ఆయన సోమవారం లేఖ రాశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్‌మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అసలు మిడ్ మానేరు సమస్య ఏమిటంటే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు రేవంత్‌కు అభినందనలు తెలియజేసిన సంజయ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎన్నో ఏళ్ల తరబడి అపరి ష్కృతంగా ఉన్న మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను, ప్రభుత్వం ఇచ్చిన హామీ లను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 17 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభు త్వం ప్రారంభించిన ప్రాజెక్టు మిడ్ మానేరు. లక్ష లాది ఎకరాలకు సాగు నీటితోపాటు తాగునీటి అవ సరాలను తీరుస్తుందనే భావనతో ప్రాజెక్టు ముంపు పరిధిలోని 12 గ్రామాల ప్రజలు ఇళ్లు, భూములు త్యాగం చేశారు. ‘ప్రభుత్వ లెక్కల ప్రకారం 12,500 మంది బాధితులున్నారు. వీరికి సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2005–06లో నాటి ప్రభుత్వం జీవో నెం.69 ప్రకారం ఐఏవై కింద ఇళ్లు మంజూరు చేసింది. ముంపు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. వీటి అమలులో తీవ్రమైన జాప్యం జరిగింది. 2018 జూన్ 15న నాటి సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికి వచ్చి మిడ్ మానేరు బాధితులకు ఐఏవై ఇళ్లకు బదులుగా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని, అందులో భాగంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లిస్తానని హమీ ఇచ్చారు. పన్నెండు గ్రామాల రైతులంతా సాగు భూమిని కోల్పోయిన నేపథ్యంలో నీలోజిపల్లి నుండి నందిగామ, అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌ను, స్కిల్ డెవలెప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తద్వారా వారిలో నైపుణ్యత పెంచి స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అలాగే 2009 కొత్త గెజిట్ ప్రకారం తేది 01–01–2015 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తామన్నారు. కానీ నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు’ అని సంజయ్ ఆ లేఖలో వివరించారు. వెంటనే సంబంధిత మంత్రి, స్థానిక శాసనసభ్యుడు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేసిన సంజయ్ ‘రెండేళ్ల క్రితం మిడ్ మానేరు ముంపు బాధితుల కోసం కొదురుపాకలో నిర్వహించిన అఖిలపక్ష ‘మహాధర్నా’లో మీరు, నేను హాజరై ముంపు బాధితులకు సంఘీభావం తెలిపాం. నాటి ధర్నాలో మిడ్‌మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించేదాకా వారి పక్షాన పోరాటం చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని మీరు హామీ ఇచ్చారు’ అని సంజయ్ గుర్తుచేశారు. -
ధాన్యం సేకరణపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: ధాన్యం సేకరణ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పారా బాయిల్డ్ ఇవ్వమని రాతపూర్వకంగా ఇచ్చిందని, ఎంవోయూ ప్రకారమే ముడి బియ్యం ఇస్తామని రాసిచ్చారని పీయూష్ గోయల్ ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ధాన్యం సేకరణపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ మేరకు పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఇప్పుడు కొత్తగా వడ్ల సేకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని, ధాన్యం సేకరణ అంశానికి సంబంధించి సీఎం ద్వారా దమ్కీలు ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. పంజాబ్ తరహాలో కొనాలని తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారని,పంజాబ్‌లో పండే బియ్యాన్ని దేశమంతటా తింటారని ఈ సందర్భంగా పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.. మరి అటువంటి బియ్యాన్ని ఇవ్వాలని కోరామని అన్నారు పీయూష్ గోయల్. రైతులను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తెలంగాణలో పండే రా రైస్ మొత్తం తీసుకుంటామన్నారు. -
కబ్జా కోరల్లో చింతల చెరువు?
హైదరాబాద్: బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని చెంగిచర్లలో ఉన్న చింతల చెరువు ఎఫ్టీఎల్ భూమి, బఫర్ జోన్ అన్యాక్రాంతమవుతుంది. ఇప్పటికే బఫర్ జోన్లో కొంత భాగం కాలనీగా ఏర్పడి కొన్ని ఇళ్లు నిర్మించుకోగా, మిగిలిన స్థలంలో మట్టినింపి చదును చేస్తున్నారు. అదే బఫర్ జోన్ పరిధిలో బహుళ అంతస్తులు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిపై మాజీ ప్రజాప్రతినిధులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చెంగిచర్లలోని చింతల చెరువు సర్వే నంబరు 57లో 23 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఒకప్పుడు తాగు, సాగునీరు అందించిన ఈ చెరువు నేడు మురికి కూపంగా మారింది. చెంగిచర్ల ఎగువ ప్రాంతంలో ఉన్న కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టగా మురుగునీరు దిగువ ప్రాంతానికి వెళ్లడానికి అవుట్ లెట్ లేకపోవడంతో కాలనీల నుంచి వచ్చే మురుగంతా చెరువులోకి వెళ్తుంది. దీంతో చెరువు అంతా మురుగునీటితో కూపంగా మారి విపరీతమైన దుర్వాసన వస్తుంది. గతంలో చెరువు ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేయక ముందు కొంత మంది సాయినగర్ కాలనీని ఏర్పాటు చేయగా, మరికొంత మంది ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం అధికారులు, పాలకవర్గం ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇటీవల కొంత మంది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న తమ ప్లాట్లకు ఎన్ఓసీలు తెచ్చుకుని మట్టి పోసి చదును చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయమై స్థానిక ప్రజలు అధికారులు, పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. చెంగిచర్ల చింతల చెరువు కట్ట ఆనుకుని ఉన్న బఫర్ జోన్లో ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరుపై ఉన్న స్థలంలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని మాజీ వార్డు సభ్యులు కుర్రి శివశంకర్, కొత్త ప్రభాకర్‌గౌడ్ మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఇరిగేషన్, రెవెన్యూ, కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. చెరువు కట్ట ఆనుకుని బఫర్ జోన్ ఉందని, సదరు స్థలానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇవ్వగా మున్సిపల్ అధికారులు ఎలాంటి పర్యవేక్షణ చేయకుండా అనుమతులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. నిబంధలనకు అనుగుణంగానే.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఎన్ఓసీ ప్రకారమే అనుమతులిచ్చాం. ఎన్ఓసీలో కట్ట అనుకుని మొత్తం 50 గజాలు బఫర్ జోన్ ఉన్నట్లు చూపారు. దాని ప్రకారం అనుమతులు మంజూరు చేశాం. మా నగరపాలక సంస్థ నుంచి ఎలాంటి అవకతవకలు జరగలేదు. –బోనగిరి శ్రీనివాస్, కమిషనర్ -
చిరువ్యాపారులను ఆదుకునేదెవరు?
హైదరాబాద్: పారిశ్రామికవాడగా పేరు గాంచిన బాలానగర్, ఫతేనగర్ డివిజన్లలోని చిన్న తరహా పరిశ్రమలపై ఆధారపడి వేలాది మంది కారి్మకులు, చిరువ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి పరిశ్రమల్లో ప్రతి ఒక్కరికీ కావాల్సిన వస్తువులు తయారు చేసి ఇస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం ఎప్పుడూ జనాలతో బిజీబిజీగా ఉంటుంది. ఇక్కడ పలువురు చిరువ్యాపారులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు. అయితే, గతేడాది కరోనా మహమ్మారి చిరువ్యాపారుల జీవనంపై ప్రభావం చూపగా, ఈ ఏడాది సెకండ్ వేవ్‌తో వారి పరిస్థితి దుర్భరంగా మారింది. ఇప్పడు లాక్డౌన్ అమల్లోకి రావడంతో వ్యాపారాలు మొత్తం మూతపడి చిరు వ్యాపారుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఈ ప్రాంతంలో తోపుడు బండ్లపై మొక్కజొన్న పొత్తులు, పుచ్చకాయలు, జామకాయలు, మామిడి పండ్లు, ఖర్జూరం, నిమ్మ షోడాలు వంటివి విక్రయిస్తూ పలువురు జీవిస్తుంటారు. పెద్ద హోటల్స్ ముందు టీస్టాల్స్, పాన్ డబ్బాలు పెట్టుకొని, పూలు అమ్ముకుంటూ పలువురు జీవిస్తారు. కరోనా ఉధృతి తగ్గడంతో గతేడాది నవంబర్ నుంచి వ్యాపారాలు పుంజుకోవడంతో చిరువ్యాపారుల్లో ఆశలు మొదలయ్యాయి. గత అప్పులను తీర్చి ఎంతో కొంత పొదుపు చేసుకోవచ్చు అని అనుకునే లోపే మహమ్మారి మళ్లీ జడలు విప్పింది. కొనుగోళ్లదారులు లేక వ్యాపారులు ఇరకాటంలో పడ్డారు. రోజు వారీ ఖర్చులు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. రాత్రిపూట కర్ఫ్యూ పెట్టడంతో వలస కారి్మకులు తమ స్వస్థలాలకు తరలి వెళ్లారు. దాంతో వ్యాపారాలు సాగకపోవడంతో తమను ఆదుకొనేది ఎవరు? అని బెంగపెట్టుకున్నారు. తాజాగా, బుధవారం నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేయడంతో వ్యాపారాలు మొత్తం మూతపడ్డాయి. దీంతో తమ కుటుంబాలను ఎలా పోషించాలని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలానగర్, ఫతేనగర్ డివిజన్లలో సుమారు 200 మందికి పైగా చిరువ్యాపారులు ఉన్నారు. ప్రభుత్వం నుంచి వీరికి ఎటువంటి సాయం అందడంలేదు. బ్యాంకులు వీరికి లోన్లు కూడా ఇవ్వడంలేదు. ఆపత్కాలంలో చిరువ్యాపారులకు ఆపన్నహస్తం అందించేందుకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కరూ బోణి కొట్టలేదు... గతేడాది లాక్‌డౌన్‌తో పూట గడవటమే కష్టంగా మారింది. అప్పటి నుంచి సరిగ్గా కోలుకోలేదు. ప్రస్తుతం లాక్డౌన్ అమలులోకి వచ్చింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే జనం రోడ్లపై తిరగాలని ప్రభుత్వం చెప్పింది. బీదర్ నుంచి వచ్చి నిమ్మకాల సోడా బండి పెట్టుకొని బతుకుతున్నాం. నిన్న, ఈరోజు ఒక్కరు కూడా నా బండి వద్ద సోడా తాగి బోణి చేయలేదు. ఇంకో రెండు వారాలు చేసి ఇక్కడ ఉండాల, ఊరు వెళ్లిపోవాలా అనేది నిర్ణయం తీసుకుంటాం. –మంజునాథ్, ఫతేనగర్ చిరువ్యాపారి నెల రోజులుగా వ్యాపారం లేదు కరోనా తొందరగా తగ్గిపోయి జనం బాగుండుదెప్పుడో అర్థం కావటం లేదు. పండ్లు, సరిగ్గా అమ్మితేనే మా కుటుంబం చక్కగా ఉంటుంది. నెల రోజులుగా సరిగ్గా వ్యాపారంమే లేదు. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. లేదా ప్రభుత్వం అయినా ఆదుకోవాలి. జహీరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. –అనిల్, పుచ్చకాయల వ్యాపారి -
తెలంగాణ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఫ్లాగ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా చాటింది. స్థానిక స్కైకింగ్స్ ఫుట్‌బాల్ అకాడమీలో జరిగిన ఈటోర్నీలో తెలంగాణ పురుషుల జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన టైటిల్‌పోరులో తెలంగాణ జట్టు 42–18 తేడాతో ఢిల్లీ జట్టుపై ఘనవిజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ 30–24తో ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొందగా, ఢిల్లీ 24–06తో హరియాణాను ఓడించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో హరియాణా, ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొందింది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో అమెరికన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీఓఓ సందీప్ చౌదరి, కార్యదర్శి నామ్‌దేవ్ శ్రీగోంకర్, ఉపాధ్యక్షులు మొవ్వ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నాకు ప్రత్యేక తెలంగాణే ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప తనకు మరేదీ ముఖ్యం కాదని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తనతో అన్నట్టు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గుర్తుచేసుకున్నారు. తాజాగా తాను రాసిన ‘ద కొలిషన్ ఇయర్స్–1996–2012’ పుస్తకంలో ఈ మేరకు పేర్కొన్నారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించిన అనంతరం కేంద్ర కేబినెట్ పదవుల పంపకాలపై మిత్రపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్న సందర్భాన్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ప్రణబ్‌జీ.. మీకు నా జీవితాశయం తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి. మీరు కేంద్ర ప్రభుత్వంలో నాకు ఏ శాఖను అప్పగిస్తారన్నది అంత ముఖ్యం కాదు. ఏ శాఖ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తా. కానీ దయచేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పరిశీలించండి..’’ అని తనతో కేసీఆర్ అన్నట్టు ప్రణబ్ పుస్తకంలో వివరించారు. -
కేసీఆర్ పిచ్చోడిలా మారుతున్నారు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రోజురోజుకు పిచ్చోడిలా మారుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి విమర్శించారు. కమ్యూనిస్టు సిద్ధాంతం కాలం చెల్లిందనే వాదన సరికాదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాల చుట్టూ కేసీఆర్ తిరిగారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా సీపీఐ నిర్ణయం తీసుకున్న తరువాతే ఉద్యమానికి ఊపొచ్చిందని చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు. 'కొరివి వీరభద్ర స్వామి మీసాలు పెట్టిన తరువాతే కేసీఆర్‌కు మీసాలొచ్చినట్టు మాట్లాడుతున్నారు. యజ్ఞయాగాలు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. సురవరం మీద విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఇందిరా పార్కు వద్ద ధర్నాలు ఉండవన్నారు. ఇప్పుడు ధర్నాలతో ఇందిరా పార్కు దద్దరిల్లుతోంది. కోదండరాం టీజేఏసీని నిష్పక్షపాతంగా నడిపిస్తున్నారు. ఆయన కేసీఆర్‌కు లొంగలేదు. ఆయనకు పదవులపై మోజు లేని వ్యక్తి. రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని ఎండగడతాం. కేసీఆర్ కావాలని కమ్యూనిస్టులతో పెట్టుకుంటున్నారు. ఆయనకాయనే భూస్థాపితం చేసుకుంటున్నారు' అని చాడా వెంకటరెడ్డి అన్నారు. -
బడ్జెట్‌పై నేడు ఆర్థిక మంత్రి సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం ఉదయం 8 గంటలకు సచివాలయంలో బడ్జెట్ రూపు రేఖలపై ఆర్థిక, ప్రణాళికా శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. గ్రామ, జిల్లాస్థాయి నుంచి వచ్చే ప్రణాళికలు, అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన నేపథ్యంలో ఆర్థికమంత్రి ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రాధాన్యం నెలకొంది. ఇదే సమయంలో బడ్జెట్ గురించి, కేంద్ర, రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు, 14వ ఆర్థిక సంఘానికి చేయాల్సిన సిఫార్సులు తదితర అంశాలపై అధికారులలో లోతుగా సమీక్షించడం ద్వారా మొత్తం ఆర్థిక రంగంపై ఈటెల పూర్తిస్థాయిలో పట్టు పెంచుకోనున్నారు.