సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప తనకు మరేదీ ముఖ్యం కాదని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తనతో అన్నట్టు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గుర్తుచేసుకున్నారు. తాజాగా తాను రాసిన ‘ద కొలిషన్ ఇయర్స్–1996–2012’ పుస్తకంలో ఈ మేరకు పేర్కొన్నారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించిన అనంతరం కేంద్ర కేబినెట్ పదవుల పంపకాలపై మిత్రపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్న సందర్భాన్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
‘‘ప్రణబ్‌జీ.. మీకు నా జీవితాశయం తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి. మీరు కేంద్ర ప్రభుత్వంలో నాకు ఏ శాఖను అప్పగిస్తారన్నది అంత ముఖ్యం కాదు. ఏ శాఖ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తా. కానీ దయచేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పరిశీలించండి..’’ అని తనతో కేసీఆర్ అన్నట్టు ప్రణబ్ పుస్తకంలో వివరించారు.
నాకు ప్రత్యేక తెలంగాణే ముఖ్యం
Published Mon, Oct 23 2017 2:38 AM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment