బడ్జెట్‌పై నేడు ఆర్థిక మంత్రి సమావేశం | finance minister to conduct budget meeting | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌పై నేడు ఆర్థిక మంత్రి సమావేశం

Aug 3 2014 1:17 AM | Updated on Jul 11 2019 5:33 PM

బడ్జెట్‌పై నేడు ఆర్థిక మంత్రి సమావేశం - Sakshi

బడ్జెట్‌పై నేడు ఆర్థిక మంత్రి సమావేశం

తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం ఉదయం 8 గంటలకు సచివాలయంలో బడ్జెట్ రూపు రేఖలపై ఆర్థిక, ప్రణాళికా శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం ఉదయం 8 గంటలకు సచివాలయంలో బడ్జెట్ రూపు రేఖలపై ఆర్థిక, ప్రణాళికా శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. గ్రామ, జిల్లాస్థాయి నుంచి వచ్చే ప్రణాళికలు, అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన నేపథ్యంలో ఆర్థికమంత్రి ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రాధాన్యం నెలకొంది. ఇదే సమయంలో బడ్జెట్ గురించి, కేంద్ర, రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు, 14వ ఆర్థిక సంఘానికి చేయాల్సిన సిఫార్సులు తదితర అంశాలపై అధికారులలో లోతుగా సమీక్షించడం ద్వారా మొత్తం ఆర్థిక రంగంపై ఈటెల పూర్తిస్థాయిలో పట్టు పెంచుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement