ఈటెల రాజేందర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, కరీంనగర్: రైతుబంధు పథకంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఈటెల మాట్లాడుతూ... హుజురాబాద్‌లో ఈ నెల 10న సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ప్రారంభిస్తారని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. రైతుల పంట పెట్టుబడి కోసం సర్కారు విడుదల చేసే ప్రతీ పైసా రైతులకే చేరుతుందన్నారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే ఏడాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 10న జరిగే సీఎం బహిరంగ సభను రైతులు తమ ఇంటి పండుగగా భావించి విజయవంతం చేయాలని కోరారు. రైతుబంధు చెక్కులు, పాస్ బుక్కుల పంపిణీలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment