తెలంగాణకు మూడు పతకాలు | Telangana gets Three Medals in National Tug of War Championship | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మూడు పతకాలు

Published Mon, Dec 31 2018 10:20 AM | Last Updated on Mon, Dec 31 2018 10:20 AM

Telangana gets Three Medals in National Tug of War Championship   - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సబ్‌ జూనియర్, జూనియర్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తాచాటారు. తమిళనాడులో జరిగిన ఈ టోర్నీలో అండర్‌–13, అండర్‌–15, అండర్‌–17 విభాగాల్లో ఓ రజతం, రెండు కాంస్యాలతో మొత్తం మూడు పతకాలు సాధించారు. అండర్‌–13 బాలికల (340 కేజీలు) విభాగం ఫైనల్లో తెలంగాణ జట్టు 1–2తో కేరళ చేతిలో పరాజయం పాలైంది.

దీంతో కేరళకు స్వర్ణం, తెలంగాణకు రజత పతకాలు లభించాయి. తమిళనాడు జట్టు మూడో స్థానంలో నిలిచింది. అండర్‌–15 బాలికల (360 కేజీలు) విభాగం సెమీఫైనల్లో తెలంగాణ 0–3తో ఢిల్లీ చేతిలో ఓడింది. కాంస్య పతకం కోసం నిర్వహించిన పోరులో 3–0తో కర్ణాటకను మట్టికరిపించి మూడో స్థానం దక్కించుకుంది. కేరళకు స్వర్ణం, ఢిల్లీకి రజత పతకాలు లభించాయి. అండర్‌–17 బాలికల (420 కేజీలు) విభాగం సెమీస్‌ తెలం గాణ 0–3తో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. అనంతరం జరిగిన కాంస్య పోరులో మన జట్టు 3–0తో తమిళనాడుపై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. కేరళకు స్వర్ణం, ఢిల్లీకి రజతం దక్కాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement