సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు నిలకడగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. మహారాష్ట్రలోని స్పోర్ట్స్ గ్రౌండ్ ప్రిపరేటరీ అకాడమీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నమెంట్‌లో తెలంగాణ అండర్–15 (440 కేజీలు), అండర్–17 (బాలుర 480 కేజీలు), అండర్–17 (మిక్స్‌డ్ టీమ్ 500 కేజీలు) జట్లు సెమీఫైనల్లోకి అడుగుపెట్టాయి. అండర్–15 బాలుర 440 కేజీల లీగ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ జట్టు వరుసగా 3–0తో గుజరాత్‌పై, 3–0తో మహారాష్ట్రపై, 3–0తో ఢిల్లీపై, 3–0తో ఆంధ్రప్రదేశ్‌పై, 3–0తో ఒడిశాపై, 3–0తో యూపీపై, 3–0తో మధ్యప్రదేశ్‌పై, 3–0తో జమ్మూ కశీ్మర్‌పై, 3–0తో హరియాణాపై, 3–0తో తమిళనాడుపై, 3–0తో అస్సాంపై, 3–0తో మణిపూర్‌పై, 3–0తో మిజోరామ్‌పై, 3–0తో ఉత్తరాఖండ్‌పై, 3–0తో త్రిపురపై, 3–0తో బిహార్‌పై గెలుపొందాయి.
నేడు జరిగే సెమీస్ మ్యాచ్‌ల్లో కర్ణాటకతో కేరళ, తెలంగాణతో ఢిల్లీ తలపడతాయి. అండర్–17 బాలుర లీగ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ 3–0తో వరుసగా గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, హరియాణా, తమిళనాడు, అస్సాం, మణిపూర్, మిజోరాం, ఉత్తరాఖండ్, త్రిపుర, బిహార్‌పై గెలిచాయి. సెమీస్ మ్యాచ్‌ల్లో తెలంగాణతో పంజాబ్, కేరళతో ఢిల్లీ ఆడతాయి. అండర్–17 మిక్స్‌డ్ టీమ్ లీగ్ మ్యాచ్‌ల్లో వరుసగా తెలంగాణ 3–0తో గుజరాత్‌పై, 3–0తో మహారాష్ట్రపై, 3–0తో ఢిల్లీపై, 3–0తో ఏపీపై, 3–0తో ఒడిశాపై, 3–0తో యూపీపై, 3–0తో మధ్యప్రదేశ్‌పై, 3–0తో జమ్మూ కశ్మీర్‌పై, 3–0తో హరియాణాపై, 3–0తో తమిళనాడుపై, 3–0తో అస్సాంపై, 3–0తో మణిపూర్‌పై, 3–0తో మిజోరామ్‌పై, 3–0తో ఉత్తరాఖండ్‌పై, 3–0తో త్రిపురపై, 3–0తో బిహార్‌పై విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టాయి. నేడు జరిగే సెమీస్ మ్యాచ్‌ల్లో మహారాష్ట్రతో కర్ణాటక, తెలంగాణతో గుజరాత్ పోటీ పడతాయి.
Comments
Please login to add a commentAdd a comment