ఈ ఏడాది ఎంతో కీలకం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా సిద్ధమయ్యేందుకు తనకు ఈ ఏడాది ఎంతో కీలకం కానుందని భారత షూటర్ మానవ్‌జిత్‌సింగ్ సంధూ అన్నాడు. ఇటీవల ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన మైకేల్ డైమండ్‌ను ఓడించి స్వర్ణం సాధించిన మానవ్‌జిత్ చక్కటి ఫామ్‌లో ఉన్నాడు.
ప్రపంచకప్‌లో విజయం తాను సరైన మార్గంలోనే పయనిస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపాడు. ‘నా శిక్షణ, టెక్నిక్ సరైన విధంగానే ఉన్నాయని తాజా విజయం చాటుతోంది. మున్ముందు కూడా దీన్ని కొనసాగించాల్సిన అవసరముంద’ని మానవ్‌జిత్ అన్నాడు.