లెక్క సరిచేసేనా! | To calculate the correction! | Sakshi
Sakshi News home page

లెక్క సరిచేసేనా!

Published Wed, Jul 1 2015 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

లెక్క సరిచేసేనా!

లెక్క సరిచేసేనా!

క్వార్టర్స్‌లో నేడు మలేసియాతో భారత్ ఢీ
♦ హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్
 
 యాంట్‌వర్ప్ (బెల్జియం) : మూడు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచి ఊపు మీదున్న భారత్... చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్‌లో భాగంగా నేడు (బుధవారం) జరిగే క్వార్టర్స్‌లో సర్దార్ సింగ్ సేన మలేసియాను ఎదుర్కోనుంది. ఈ రెండు జట్లు చివరిసారి ఏప్రిల్‌లో అజ్లాన్ షా కప్‌లో తలపడగా మలేసియా 3-2తో గెలిచింది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది.

అయితే ఈ నాకౌట్ పోరులో రాణించాలంటే భారత జట్టు తమలోని లోపాలను సవరించుకోవాల్సి ఉంది. ముఖ్యంగా డిఫెండర్లు సమర్థవంతంగా రాణించకపోవడంతో ఆసీస్‌తో మ్యాచ్‌లో ఆరు గోల్స్ సమర్పించుకోవాల్సి వచ్చింది. పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్, డిఫెండర్ రూపిందర్ పాల్ సింగ్ గాయంతో జట్టుకు దూరం కావడం ఇబ్బందిగా మారింది.
 
 రాత్రి 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement