
సాక్షి, హైదరాబాద్: ఇండోనేసియా ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులు సత్తా చాటారు. జకార్తాలో జరిగిన ఈ అంతర్జాతీయ పోటీల్లో 12 పతకాలను సాధించారు. వీటిలో 5 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి.
మొత్తం 21 దేశాలకు చెందిన 1453 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొనగా ఆర్టీసీ క్రీడాకారులు జీపీ లక్ష్మణ్, సీమ, మెహిదీ, సంగీత, వీణ, స్వరాజ్యలక్ష్మి మెరుగైన ప్రదర్శనతో పతకాలను సొంతం చేసుకున్నారు. రోజువారీ విధులు సమర్థవంతంగా నిర్వహిస్తూనే క్రీడల్లోనూ సత్తా చాటిన తమ ఉద్యోగులను టీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెవెన్యూ, ఐటీ), కార్యదర్శి పురుషోత్తం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment