హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. రాజస్తాన్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా సన్‌రైజర్స్ జట్టుకు వార్నర్, రాజస్తాన్ జట్టుకు స్టీవ్ స్మిత్‌లు దూరమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇరు జట్లు బలంగా ఉండటంతో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకూ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ తీసుకున్న జట్లు గెలవడంతో సన్‌రైజర్స్ విజయంపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
తుది జట్ల వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ : శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, దీపక్ హుడా, యుసఫ్ పఠాన్, షకీబ్ అల్ హసన్, వృద్ధిమాన్ సాహా, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, బిల్లి స్టాన్లేక్, సిద్దార్థ్ కౌల్
రాజస్తాన్ రాయల్స్ : అజింక్యా రహానే(కెప్టెన్), డీఆర్సీ షార్ట్, రాహుల్ త్రిపాఠి, సంజూ సామ్సన్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, బెన్ లాఫ్లిన్, కే గౌతమ్, శ్రేయస్ గోపాల్, దావల్ కులకర్ణి, జయదేవ్ ఉనద్కట్
Comments
Please login to add a commentAdd a comment