యూఎస్‌ ఓపెన్‌పై జూన్‌లో తుది నిర్ణయం | US Open Tennis COVID-19 Decision by June | Sakshi
Sakshi News home page

యూఎస్‌ ఓపెన్‌పై జూన్‌లో తుది నిర్ణయం

Published Sat, Apr 18 2020 5:39 AM | Last Updated on Sat, Apr 18 2020 9:10 AM

US Open Tennis COVID-19 Decision by June - Sakshi

న్యూయార్క్‌: షెడ్యూలు ప్రకారం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ జరుగుతుందని ఆశిస్తున్నట్లు టోర్నీ నిర్వాహకులు తెలిపారు. ఏ నిర్ణయమైనా జూన్‌లోనే తీసుకుంటామని యూఎస్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మైక్‌ డౌజ్‌ తెలిపారు. ‘ఆఖరి గ్రాండ్‌స్లామ్‌పై ఇప్పుడే చర్చించాల్సిన అవసరమైతే లేదు. గేట్లు మూసి నిర్వహించడం కుదరదు.

మా టెన్నిస్‌ స్ఫూర్తికి ఇది విరుద్ధం. ఈ టోర్నీకి ఇంకా చాలా సమయముంది. కాబట్టి అనుకున్నట్లే ఈవెంట్‌ జరుగుతుందని భావిస్తున్నాం. మా లక్ష్యం కూడా అదే! అయితే... ఇది ఆరోగ్యకరంగా జరగాలన్నదే మా ధ్యేయం. ఆటగాళ్లు, అధికారులు, ప్రేక్షకులు ఇలా ఎవరికీ ఏ హాని జరగకుండా ఆహ్లాదకరంగా సాగిపోవాలని ఆశిస్తున్నాం’ అని అన్నారు. వైద్య నిపుణుల సలహామేరకే తాము నడుచుకుంటామని... వారిని సంప్రదించి సమీక్షించిన మీదటే మా నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement