న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఎప్పుడూ తనదైన శైలిలో స్పందించే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తాజాగా చేసిన మరో ట్వీట్ ఆకట్టుకుంది. ప్రధానంగా జూలై7న బర్త్ డే జరుపుకున్న ఎంఎస్ ధోని, జూలై 8వ తేదీన పుట్టిన రోజు జరుపుకున్న సౌరవ్ గంగూలీలను ఉదహరిస్తూ సెహ్వాగ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘జూలై నెలలో పుట్టండి.. టీమిండియాకు కెప్టెన్ అవ్వండి’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఈ క‍్రమంలోనే మంగళవారం(జూలై 10) పుట్టినరోజు జరుపుకోబోతున్న టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ పేరును కూడా సెహ్వాగ్ ప్రస్తావించాడు.
‘జూలై7 వ తేదీన ఎంఎస్ ధోని జన్మిస్తే, జూలై 8వ తేదీన సౌరవ్ గంగూలీ, జూలై 10న సునీల్ గావస్కర్‌లు జన్మించారు. మధ్యలో జూలై9 మిస్సవడంతో, ఈ తేదీలో ఎవరు ఒకరు పుట్టి టీమిండియా భవిష్యత్తు టీమిండియా కెప్టెన్‌గా నిలవండి’ అని సెహ్వాగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. చివరగా జూలై నెలలో పుట్టి టీమిండియా కెప్టెన్ కావాలని సెహ్వాగ్ కోరాడు.
July 7th- MS Dhoni
July 8th- Sourav Ganguly
July 9th- ?
July 10th- Sunil Gavaskar
The missing 9th. Somewhere, a future India captain and icon will be born or celebrating his birthday today.#JulyMePaidaHoJaaoCaptainBanJaao
— Virender Sehwag (@virendersehwag) 9 July 2018
Comments
Please login to add a commentAdd a comment