సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పి. సాయి విష్ణు (రంగారెడ్డి), కె. భార్గవి (రంగారెడ్డి) ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. బండ్లగూడ ఆసియన్ స్పోర్ట్స్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన అండర్–17 బాలుర సింగిల్స్ రెండో రౌండ్‌లో సాయివిష్ణు 21–11, 21–17తో అభినవ్ కృష్ణ (హైదరాబాద్)పై గెలుపొందగా... బాలికల విభాగంలో టాప్‌సీడ్ కె.భార్గవి 21–11, 21–18తో ఏవై స్ఫూర్తి (వరంగల్)ని ఓడించింది. బాలుర డబుల్స్ విభాగంలో వర్షిత్ రెడ్డి (హైదరాబాద్)–విఘ్నేశ్ (రంగారెడ్డి) జోడీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో కె.సాత్విక్ రెడ్డి (మెదక్)–శ్రుతి (హైదరాబాద్) జంట క్వార్టర్స్‌కు చేరుకున్నారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇతర రెండోరౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు
బాలుర సింగిల్స్: తారక్ శ్రీనివాస్ (హైదరాబాద్) 21–19, 11–21, 21–12తో అభినయ్ (వరంగల్)పై, భార్గవ్ (ఖమ్మం) 21–9, 21–17తో జనీత్ వివేక్ (హైదరాబాద్)పై, హర్ష (రంగారెడ్డి) 21–16, 21–14తో ధన్ విన్ (హైదరాబాద్)పై, లోకేశ్ (మెదక్) 21–17, 21–10తో నారాయణపై, రోహన్ కుమార్ (రంగారెడ్డి) 21–18, 21–12తో ఉత్తేజ్ కుమార్‌పై, రవి ఉత్తేజ్ (రంగారెడ్డి) 21–18, 21–12తో సిద్ధార్థ్ (కరీంనగర్)పై, స్రవంత్ సూరి (హైదరాబాద్) 21–8, 21–4తో అభిషేక్ (రంగారెడ్డి)పై, వినీత్ (హైదరాబాద్) 22–20, 14–21, 21–17తో వైభవ్ (కరీంనగర్)పై, శశాంక్ సాయి (హైదరాబాద్) 21–14, 21–19తో రుషేంద్ర (మెదక్)పై, సమీర్ రెడ్డి (రంగారెడ్డి) 21–15, 21–11తో అనిరుధ్ (వరంగల్)పై, ఉనీత్ కృష్ణ 21–11, 21–17తో భవ్యంత్ సాయి (రంగారెడ్డి)పై, వర్షిత్ రెడ్డి (హైదరాబాద్) 21–14, 20–22, 21–15తో నిహిత్ (రంగారెడ్డి)పై గెలుపొందారు.
బాలికల సింగిల్స్: శ్రుతి (హైదరాబాద్) 21–1, 21–2తో ప్రసన్నపై, సంజన (రంగారెడ్డి) 21–9, 21–12తో సాయి శ్రీయపై, దేవి 21–6, 21–1తో కిరణ్ (కరీంనగర్)పై, శ్రేష్టారెడ్డి (హైదరాబాద్) 21–11, 23–21తో నిఖిల (రంగారెడ్డి)పై, ఆశ్రిత 21–7, 21–1తో కీర్తన (జనగాం)పై, వెన్నెల (హైదరాబాద్) 21–7, 21–4తో నిఖిత రావు (వరంగల్)పై, శిఖా (రంగారెడ్డి) 21–11, 21–13తో హాసినిపై, కైవల్య లక్ష్మి 21–9, 21–7తో శ్రీవల్లి (రంగారెడ్డి)పై, వైష్ణవి (హైదరాబాద్) 21–8, 21–12తో అన్విత (ఖమ్మం)పై, మిహిక 21–19, 22–20తో పల్లవి జోషి (హైదరాబాద్), పూజిత (రంగారెడ్డి) 21–2, 21–4తో హేమపై, శ్రావ్య 21–8, 21–8తో తన్వీ (హైదరాబాద్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment