
కరాచీ:. గత ఇంగ్లండ్ పర్యటనతో పాటు వెస్టిండీస్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లోనూ ఎంఎస్ ధోని బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఆస్ట్రేలియాతో టీ20సిరీస్‌కు ధోనికి చోటు కల్పించలేదు సెలక్టర్లు. ఆసీస్‌తో మూడు టీ20లకు ధోని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్ కోసం సెలక్టర్లు ఇంకా జట్టుని ప్రకటించలేదు. ఈ వన్డే సిరీస్‌లో గనుక ధోనికి ఎంపిక కాకపోతే వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో అతను ఎంపిక కావడమనేది ప్రశ్నార్థకమనే వాదన వినిపిస్తోంది.
కాగా, వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ధోనిని తప‍్పక ఆడించాలని అంటున్నాడు పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్. ‘ఫామ్ అనేది తాత్కాలికం, క్లాస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి, వచ్చే వరల్డ్‌కప్‌లో ధోనిని చూడాలని అనుకుంటున్నా. ధోని ఓ మ్యాచ్ విన్నర్, అతడిలో ఇంకా క్రికెట్ ఉందని నేను భావిస్తున్నా, ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ కప్‌లో ధోని అనుభవం టీమిండియాకు అవసరం’ అని అక్రమ్ అన్నాడు. రెండు రోజుల క్రితం మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం వరల్డ్‌కప్ నాటికి ధోని తప్పక ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment