విరాట్ కోహ్లి
నాగ్‌పూర్ : ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ గెలుపుతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఉత్సాహంగా ఉన్నారు. నాగ్‌పూర్ వేదికగా నేడు జరిగే రెండో వన్డేకు ముందు ఉత్సాహంగా కనిపించాడు. ప్రాక్టీస్ సెషన్ ఆస్వాదిస్తూ.. చిందులేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. అది నెట్టింట వైరల్ అయింది.
ఈ వీడియోలో.. విదర్భ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌ను ఆస్వాదిస్తూ కోహ్లి ఆహ్లదకరంగా కనిపించాడు. పక్కనే ఉన్న కేఎల్ రాహుల్, ధోనితో జోకులు వేస్తూ.. చిందులేసాడు. కోహ్లి డ్యాన్స్‌కు ధోని, రాహుల్ ముఖంలో నవ్వులు పూసాయి. టీ20 సిరీస్‌ను వరుస పరాజయాలతో కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్‌కు ముందు సరిగ్గా నాలుగే మ్యాచ్‌లు ఉండటంతో అన్ని మ్యాచ్‌లను గెలవాలని భావిస్తోంది. ఈ సిరీస్‌తో కేఎల్ రాహుల్, రిషభ్‌పంత్, విజయ్ శంకర్, సిద్దార్థ్ కౌల్‌ల ప్రపంచకప్ భవితవ్యం తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment