బ్రాత్వైట్ బౌలింగ్ పై ఫిర్యాదు | West Indies' Kraigg Brathwaite reported for suspect action | Sakshi
Sakshi News home page

బ్రాత్వైట్ బౌలింగ్ పై ఫిర్యాదు

Published Mon, Aug 21 2017 3:36 PM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

బ్రాత్వైట్ బౌలింగ్ పై ఫిర్యాదు

బ్రాత్వైట్ బౌలింగ్ పై ఫిర్యాదు

బర్మింగ్హామ్:వెస్టిండీస్ స్పిన్నర్ క్రెయిగ్ బ్రాత్ వైట్ బౌలింగ్ శైలి వివాదాస్పదంగా మారింది. ఇంగ్లండ్ తో ఎడ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో బ్రాత్ వైట్ బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానిలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి మ్యాచ్ అధికారులు నివేదిక అందజేశారు. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు తెలియజేసిన ఐసీసీ.. అతని బౌలింగ్ యాక్షన్ ను సరి చేసుకోవాలని సూచించింది.  ఈ మేరకు  తన బౌలింగ్ యాక్షన్ కు సంబంధించి 14 రోజుల్లో పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది.  ఐసీసీ నిబంధనల ప్రకారం అప్పటివరకూ బ్రాత్ వైట్ జట్టులో కొనసాగుతాడు. అంటే ఇంగ్లండ్ తో హెడింగ్లెలో జరిగే రెండో టెస్టులో బ్రాత్ వైట్ ఆడతాడు.

ఇప్పటివరకూ 38 టెస్టు మ్యాచ్ లు ఆడిన బ్రాత్ వైట్ 12 వికెట్లు తీశాడు. 2015లో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్టులో బ్రాత్ వైట్  29 పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించాడు. అదే టెస్టుల్లో అతని అత్యుత్తమ ప్రదర్శన.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement