విండీస్‌ను గెలిపించిన ఆంబ్రిస్‌  | West Indies won ultimately on Ireland | Sakshi
Sakshi News home page

విండీస్‌ను గెలిపించిన ఆంబ్రిస్‌ 

Published Sun, May 12 2019 3:51 AM | Last Updated on Sun, May 12 2019 3:51 AM

 West Indies won ultimately on Ireland - Sakshi

డబ్లిన్‌: భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై చివరకు వెస్టిండీస్‌దే పైచేయి అయింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఆండ్రూ బాల్‌ బిర్నీ (124 బంతుల్లో 135; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ, ఓపెనర్‌ స్టిర్లింగ్‌ (77), కెవిన్‌ ఓబ్రెయిన్‌ (63) అర్ధ సెంచరీలు చేశారు. ఛేదనలో విండీస్‌ ఓపెనర్‌ సునీల్‌ ఆంబ్రిస్‌ (126 బంతుల్లో 148; 19 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగాడు. మరో ఓపెనర్‌ షై హోప్‌ (30), రోస్టన్‌ చేజ్‌ (46), కార్టర్‌ (43 నాటౌట్‌), కెప్టెన్‌ హోల్డర్‌ (36) ఇలా క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మన్‌ రాణించడంతో కరీబియన్‌ జట్టు 47.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసి గెలుపొందింది. పరుగుల పరంగా వన్డేల్లో విండీస్‌కు ఇదే అత్యధిక ఛేదన. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement