
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యూసఫ్ పఠాన్ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేల పరుగుల మార్కును దాటిన 13వ ఆటగాడిగా యూసఫ్ నిలిచాడు. ముంబై బౌలర్ ముస్తాఫిజుర్ వేసిన ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీయడం ద్వారా యూసఫ్ మూడు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. తన కెరీర్‌లో 155వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న యూసఫ్ 138 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను నమోదు చేశాడు. తద్వారా దినేశ్ కార్తీక్ తర్వాత స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో సురేశ్ రైనా(4,658)అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లి(4,649), రోహిత్ శర్మ(4, 345), గౌతం గంభీర్(4,217), డేవిడ్ వార్నర్(4,014), ఉతప్ప(3,940), క్రిస్ గేల్(3,855), ధోని(3,700), ధావన్(3,696), ఏబీ డివిలియర్స్(3,685), రహానే(3,217), దినేశ్ కార్తీక్(3,097)లు వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment