జైనులాబ్దీన్‌కు 7 స్వర్ణాలు | Zain clinches seven gold medals in TS Shooting Championship | Sakshi
Sakshi News home page

జైనులాబ్దీన్‌కు 7 స్వర్ణాలు

Aug 20 2018 10:10 AM | Updated on Aug 20 2018 10:10 AM

Zain clinches seven gold medals in TS Shooting Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆగా మొహమ్మద్‌ జైనులాబ్దీన్‌ అద్భుత ప్రదర్శనతో చెలరేగాడు. గచ్చిబౌలిలోని శాట్స్‌ షూటింగ్‌ రేంజ్‌లో జరిగిన ఈ టోర్నీలో జైనులాబ్దీన్‌ 7 స్వర్ణాలు, ఒక కాంస్యంతో మొత్తం 8 పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. 10మీ. పురుషుల ఎయిర్‌పిస్టల్, 50మీ. పురుషుల ఫ్రీ పిస్టల్, 50మీ. జూనియర్‌ పురుషుల ఫ్రీ పిస్టల్, 25మీ. జూనియర్‌ పురుషుల స్పోర్ట్స్‌ పిస్టల్, 25మీ. పురుషుల స్టాండర్డ్‌ పిస్టల్, 25మీ. జూని యర్‌ పురుషుల స్టాండర్డ్‌ పిస్టల్, 10మీ. పురుషుల ఎయిర్‌పిస్టల్‌ ఈవెంట్‌లలో జైన్‌ పసిడి పతకాలను కొల్లగొట్టాడు. 25మీ. పురుషుల సెంటర్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో కాంస్యాన్ని గెలుచుకున్నాడు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో నగరానికి చెందిన మరో యువ షూటర్‌ కావలి రాజ్‌విక్రమ్‌ స్వర్ణం, కాంస్యంతో ప్రతిభ కనబరిచాడు. అతను 10మీ. జూనియర్‌ పురుషుల వ్యక్తిగత ఎయిర్‌రైఫిల్‌ విభాగంలో పసిడిని, 10మీ. యూత్‌ పురుషుల వ్యక్తిగత ఎయిర్‌రైఫిల్‌ కేటగిరీలో కాంస్య పతకాన్ని అందుకున్నాడు.  

ఇతర ఈవెంట్‌ల పతక విజేతల వివరాలు
 10మీ. పురుషుల ఎయిర్‌పిస్టల్‌: 1. జైనులాబ్దీన్, 2. కౌశిక్, 3. తనిష్క్‌ మురళీధర్‌.  
 10మీ. యూత్‌ మెన్‌ ఎయిర్‌రైఫిల్‌: 1. షణ్ముఖ రెడ్డి, 2. పృథ్వీ, 3. రాజ్‌విక్రమ్‌; మహిళలు: 1. మరియా తనీమ్, 2. డి.అక్షిత, 3. కె. సంధ్య.
 10మీ. యూత్‌ పురుషుల పీప్‌ సైట్‌ ఎయిర్‌రైఫిల్‌: 1. ధనుశ్, 2. తిరుమల జయంత్, 3. నిమిష్‌; బాలికలు: 1. హొమాన్షిక రెడ్డి, 2. తన్వి, 3. సంతోషి.  
 25మీ. జూనియర్‌ పురుషుల స్టాండర్డ్‌ పిస్టల్‌: 1. జైనులాబ్దీన్, 2. మహేంద్ర రెడ్డి, 3. నాగసాయి తరుణ్‌.  
 25మీ. పురుషుల స్టాండర్డ్‌ పిస్టల్‌: 1. జైనులాబ్దీన్, 2. ప్రసన్న కుమార్, 3. బి. శంకర్‌.
 25మీ. జూనియర్‌ పురుషుల స్పోర్ట్స్‌ పిస్టల్‌: 1. జైనులాబ్దీన్, 2. మహేంద్ర రెడ్డి, 3. తనిష్క్‌; మహిళలు: 1. జాబిలి, 2. ఇషా సింగ్, 3. ఫాతిమ.
 50మీ. జూనియర్‌ పురుషుల ఫ్రీ పిస్టల్‌: 1. జైనులాబ్దీన్, 2. ఎం. మహేంద్ర రెడ్డి.  
 50మీ. పురుషుల ఫ్రీ పిస్టల్‌: 1. జైనులాబ్దీన్, 2. మహేంద్ర రెడ్డి, 3. కె. నిరంజన్‌ రెడ్డి.  
 50మీ. జూనియర్‌ మహిళల స్మార్‌బోర్‌ రైఫిల్‌ ప్రోన్‌: 1. మౌనిక, 2. తన్వి, 3. సయేదా; పురుషులు: 1. అబిద్‌ అలీఖాన్, 2. ధీరజ్, 3. జయంత్‌.  
 10మీ. జూనియర్‌ పురుషుల ఎయిర్‌పిస్టల్‌: 1. జైనులాబ్దీన్, 2. అనుభవ్‌ తివారీ, 3. కౌశిక్‌.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement