వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
Published Mon, Apr 10 2017 1:17 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ద్వారకానగర్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఆటో - ద్విచక్రవాహనం ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతపురం జిల్లా విడపనకల్లు వద్దు రెండు ద్విచక్రవాహానాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
కష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ శివారులో ఎదురెదురుగా వస్తున్న లారీ-టిప్పర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నెల్లూరు జిల్లా పొదలకూడు మండలం చాటగొట్ల గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న టిప్పర్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో.. ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి కేసులు నమోదు చేశారు.
Advertisement
Advertisement