అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నుంచి అనంతపురం వరకూ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అలైన్‌మెంట్ ఖరారుకు, భూ సేకరణకు సీఎం చంద్రబాబు నాయుడు చైర్మన్‌గా కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ కమిటీలో అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా, మెంబర్ కన్వీనర్‌గా రవాణా, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉంటారు. సభ్యులుగా ఉప ముఖ్యమంత్రి(రెవెన్యూ), ఆర్థిక శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నేషనల్ హైవేస్ అథారిటీ చైర్మన్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రెటరీ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్స్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అనంత 'ఎక్స్‌ప్రెస్ వే'కు సీఎం చైర్మన్‌గా కమిటీ
Published Mon, Dec 19 2016 7:08 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement