ఎన్‌హెచ్‌ఏఐతో కలసి పెగ్ మార్కింగ్‌కు కసరత్తు
సాక్షి, అమరావతి: అనంతపురం–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అలైన్‌మెంట్ బాధ్యతల్ని ప్రభుత్వం ఆర్వీ అసోసియేట్స్‌కు అప్పగించింది. రాజధానికి సీడ్ యాక్సెస్ రోడ్డు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారీతో పాటు అనంత– అమరావతి రోడ్డు డీపీఆర్ బాధ్యతల్ని గతంలో ఆర్వీ అసోసియేట్స్‌కు అప్పగించిన ప్రభుత్వం తాజాగా అలైన్‌మెంట్ బాధ్యతల్ని కూడా అదే సంస్థకు అప్పగించింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేయించాల్సిన అలైన్‌మెంట్, భూసేకరణ తదితర బాధ్యతల్ని ఏకంగా కన్సల్టెన్సీకి అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్ వేకు అలైన్‌మెంట్, భూ సేకరణ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టాల్సి ఉంది. ఈ రహదారికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నందున మొత్తం పనులు ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. అయితే ఆర్వీ అసోసియేట్స్ ఎన్‌హెచ్‌ఏఐతో కలిసి సర్వే నిర్వహిస్తుందని ఆర్‌అండ్‌బీ వర్గాలు పేర్కొనడం గమనార్హం.
‘ఆర్వీ’కి అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే
Published Mon, Feb 13 2017 2:23 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM
Advertisement
Advertisement