అందానిక మెరుగులు
తమిళ సినిమా : చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. నటి అంజలి ప్రస్తుతం ఆ పనిలో పడ్డారు. ఈ అమ్మడు నిజంగా లక్కి అని చెప్పాలి. రెండేళ్ల క్రితం పినతల్లి భారతితో విభేదాలు, దర్శకుడు కలైంజియంతో వివాదాలు అంటూ కలకలం పుట్టించి అనుహ్యంగా చెన్నైను వీడి హైదరాబాద్‌కు చెక్కేశారు. పనిలో పనిగా అక్కడ రెండు మూడు చిత్రాలు చేసి, మళ్లీ కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమలో అంజలి కథ ముగిసినట్టేననుకున్న వాళ్ల నోళ్లు మూయించేలా ప్రస్తుతం జయం రవి సరసన అప్పాటక్కర్, విమల్‌తో మాప్పిలై సింగం చిత్రాల్లో నటిస్తున్నారు.
ఈ రెండు చిత్రాలపై ఆమె చాలా నమ్మకం పెట్టుకున్నారు. మరో మూడు కొత్త చిత్రాల అవకాశాలు తలుపు తట్టాయట. ఆ చిత్ర వివరాలు చెప్పమంటే త్వరలోనే ఆయా చిత్ర వర్గాలు వివరాలు వెల్లడిస్తాయని అంజలి తనదైన స్టైల్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన అందాలకు మెరుగులు దిద్దుకునే పనిలో ఉన్నారట. నిత్యం శారీరక కసరత్తులు చేస్తూ, నాజూకుతనాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నట్టు అంజలి తెలిపారు.