ఘనంగా ఉప్పి పుట్టిన రోజు వేడుక | birthday celebration hero upendra | Sakshi
Sakshi News home page

ఘనంగా ఉప్పి పుట్టిన రోజు వేడుక

Published Fri, Sep 19 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

ఘనంగా ఉప్పి పుట్టిన రోజు వేడుక

ఘనంగా ఉప్పి పుట్టిన రోజు వేడుక

  • ఉప్పి-2 టీజర్‌ను విడుదల చేసిన శివరాజ్‌కుమార్
  • సాక్షి, బెంగళూరు : దర్శకుడు కావాలనే కోరికతో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టిన ఉపేంద్ర అనంతర దర్శకత్వంతో పాటు తనదైన మార్కు నటనతో హీరోగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. శాండల్‌వుడ్ అభిమానులతో రియల్‌స్టార్‌గా పిలిపించుకునే ఉప్పి పుట్టినరోజు వేడుకలను ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు గురువారమిక్కడ ఘనంగా జరుపుకున్నారు. 46వ వసంతంలోకి అడుగుపెట్టిన ఉపేంద్ర ఆయన భార్య ప్రియాంక, తల్లిదండ్రులు, అభిమానుల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
     
    బుధవారం రాత్రి నుంచే ఉపేంద్ర నివాసానికి చేరుకున్న అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. ఇక ఉప్పి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లిన ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్, ఉప్పికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఉపేంద్ర అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉప్పి-2 టీజర్‌ను కూడా శివరాజ్‌కుమార్ ఈ సందర్భంగా లాంఛనంగా ఆవిష్కరించారు.
     
    నేడు ప్రేక్షకుల ముందుకు‘సూపర్ రంగ’....

    గురువారం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఉపేంద్రకు పుట్టినరోజు కానుకగా ఆయన నటించిన ‘సూపర్ రంగ’ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ హాస్యనటుడు సాధుకోకిల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, కె.మంజు నిర్మాణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తెలుగులో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘కిక్’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో కృతి కర్బందా కథానాయికగా కనిపించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ఉపేంద్రకు ఎలాంటి అనుభవాన్ని అందించనుందో వేచిచూడాల్సిందే.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement