పోలవరంలో బస్సు ప్రమాదం | bus accident at polavaram project | Sakshi
Sakshi News home page

పోలవరంలో బస్సు ప్రమాదం

Published Fri, Dec 30 2016 1:06 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

bus accident at polavaram project

పోలవరం రూరల్‌ : పోలవరం ప్రాజెక్టు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తణకు మండలం వేల్పూరు నుంచి పోలవరం వస్తోన్న ప్రైవేటు స్కూల్‌ బస్సు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తోన్న కొవ్వూరు ఏఓ వేణుగోపాల్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. ఏఈఓ రాంబాబుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న మరో 10 మందికి కూడా గాయాలయ్యాయి. బ్రేకులు ఫెయిల్‌ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలవరంలో జరిగే సీఎం సభకు తరలిస్తుండగా ప్రజలను తరిలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement