మత్తులో యువత చిత్తవుతోంది. సరదాగా మొదలెడుతున్న ఈ వ్యవహారం వ్యసనంగా మారి భవిష్యత్‌ను చీకటి చేస్తోంది. స్నేహితుడికి అలవాటు ఉందనో, సరదాగా ఉం టుందనో, ఇంట్లో నాన్నకు కూడా అలవాటే కదా అనో యువత మత్తు పదార్థాలను తీసుకోవడం మొదలు పెడుతున్నారు. కానీ ఈ మొదలు వారి బంగారు భవిష్యత్‌ను అంతం చేస్తోంది. పదిహేనేళ్ల నుంచి పంతొమ్మిదేళ్ల లోపు కుర్రాళ్లు ఈ అలవాట్లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా సాధారణ పట్టణాలు, గ్రామాల్లోని యువత గుట్కా, ఖైనీ వంటి వాటిపై మొగ్గు చూపుతున్నారు. కాలక్షేపానికి, వినోదానికి, స్టైల్ కోసం చేసే ఈ పని రోగాలను తీసుకువస్తుందని వారికి తెలియడం లేదు. చదువు లేని యువకులే కాకుండా చదువుకున్న వారు కూడా ఈ దారిలోనే నడుస్తుండడం విచారకరం.
గుట్కాలో రసాయన పదార్థాలు బెటల్ నెట్స్, కొటెట్, టుబాకో, లైమ్, సాఫ్రిన్, సింథటిక్, ఆరోనాటిక్ రసాయన ఫ్లేవర్లు ఉన్నాయి. ఇవి కొంత సమయం మత్తును కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే వీటికి బానిస అయితే మాత్రం అనారోగ్యం కలుగుతుందని, జీర్ణశక్తి తగ్గడం, నరాల బలహీనత, రక్తహీనత వంటివ్యాధులు వచ్చి క్యాన్సర్‌కు దారి తీస్తుందని వారు హెచ్చరిస్తున్నాయి. ఇవి తెలిసినా చాలా మంది ఈ అలవాటును మానలేకపోతున్నారు. ఖైనీ తినేటప్పుడు చాలా మంది దిగువ పెదవి లోపలపెడతారు. దీంతో పెదవి పొక్కి చీము పుండ్లు పుట్టే అవకాశం ఉంది. గుట్కా, పాన్‌పరాగ్, మసాలాలు నమలడం వల్ల కొంత కాలానికి దంతాల చిగుళ్లు పూర్తిగా ఒరిసి కుళ్లిపోయి దంతాలు పూర్తిగా పాడై పోతాయి. నోరంతా దుర్వాసన రావడం మొదలవుతుంది.
పొగతాగటం కన్నా ఖైనీ, పాన్‌పరాగ్‌లు వేసుకోవడం ప్రాణాంతకం. ఖైనీలు, పాన్‌పరాగ్‌లు విచ్చలవిడిగా పాన్‌షాపుల్లో, చిన్నదుకాణాల్లో సైతం లభ్యమవుతుండటంతో కుర్రా ళ్లు ఇంట్లో తెలియకుండా వీటిని వాడుతున్నారు. ఇవి లేకుండా ఏమీ చేయలేకపోతున్నామని చాలా మంది చెబుతుండడం విశేషం. రిక్షా కార్మికుల నుంచి కాలేజీ విద్యార్థుల వరకు అందరూ దీనికి బానిసలే. ఒకప్పుడు వీటిపై నిషేధం విధించిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని సరిగా అమలు చేయకపోవడంతో వీటి విక్రయా లు ఊపందుకున్నాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. పాన్‌పరాగ్, గుట్కా, ఖైనీలపై ప్రభుత్వం నిషేధం విధించి వీటి విక్రయాలను పూర్తిస్థాయిలో తగ్గించాలని పలువురు కోరుతున్నారు.
మత్తుతో చిత్తు
Published Wed, Aug 27 2014 10:19 PM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement
Advertisement