‘కోదండరామ్ పార్టీ పెడతారనుకోను’
Published Mon, Jan 23 2017 4:05 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పార్టీ పెడతారని తాను అనుకోవడం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఎవరు పోరాడినా తాము మద్ధతిస్తామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులు బలపడాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం నాయకుడు తమ్మినేని పాదయాత్రకు కాంగ్రెస్ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. నల్గొండలో తమ్మినేనితో కలిసి తానూ పాదయాత్రలో పాల్గొంటానని తెలిపారు. యూపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా..విద్యార్థి, యువగర్జనలో రాహుల్ పాల్గొంటారని చెప్పారు. ఐటీఐఆర్‌పై కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఐటీఐఆర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల్లో ఎండగడతామన్నారు.
Advertisement