సాక్షి,బెంగళూరు: భవన నిర్మాణ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్యాలెస్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కార్మికశాఖ మంత్రి పరమేశ్వర్‌నాయక్ కార్మికుల కోసం త్వరలో ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలను వెల్లడించారు. మొదట ముఖ్యమంత్రి సిద్ధరావ ుయ్య మాట్లాడుతూ... నిర్మాణ రంగంలో మెళకువలపై శిక్షణ ఇవ్వడానికి వీలుగా రాష్ట్రంలో రూ.200 కోట్ల ఖర్చుతో కన్‌స్ట్రక్షన్ అకాడమి ఏర్పాటు చేయనున్నామన్నారు.
నిర్మాణరంగంలోని కార్మికుల పిల్లల కోసం రూ.250 కోట్ల వ్యయంతో బెంగళూరు, హుబ్లీతో సహా రాష్ట్రంలో ఐదు చోట్ల హాస్టల్ సౌకర్యం ఉన్న పాఠశాలలను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఈ రంగంలోని వారి కోసం ఉపయోగపడేలా ప్రత్యేకంగా బీబీఎంపీ పరిధిలో రూ.24 కోట్ల వ్యయంతో నాలుగు... ప్రతి జిల్లా కేంద్రంలో రూ.3 కోట్ల వ్యయంతో ఒక్కొక్క కల్యాణ వ ుంటపాలను నిర్మించనున్నామన్నారు. అనంతరం ఇదే వేదికపై ఉన్న మంత్రి పరమేశ్వర్ నాయక్ మాట్లాడుతూ... నిర్మాణ రంగంలోని మహిళలకు రూ.15 వేల ప్రసూతి భత్యాన్ని కల్పించే ఆలోచన కూడా ప్రభుత్వం వద్ద ఉందన్నారు.
ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలో పూర్తి కానున్నాయన్నారు. ఇకపై నిర్మాణ రంగంలోని కార్మికుల పిల్లలు ఇంజినీరింగ్, వైద్యవిద్య తదితర వృత్తివిద్యా కోర్సుల్లో పీజీ కోర్సు చదువుతుంటే నెలకు రూ.2 వేల ఉపకార వేతనాన్ని ఇవ్వనున్నామని తెలిపారు. నిర్మాణ సమయంలో కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పరిహారాన్ని ఇవ ్వనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి జార్జ్, కార్మికశాఖ విభాగం అధ్యక్షుడు ఎస్.ఎస్ ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికులకు వరాల జల్లు
Published Mon, Sep 2 2013 2:46 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement