palace ground
-
మహారాజ్ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!
హోటల్స్, రెస్టారెంట్లలో వాటి రేంజ్‌ని బట్టి వివిధ విధానాల్లో సర్వింగ్ ఉంటుంది. కొన్నింటిలో బఫే లేదా సెల్ఫ్ సర్వింగ్ వంటివి ఉంటాయి. రాజుగారీ ఫ్యాలెస్‌లా ఉండే లగ్జరీయస్ హోటల్స్‌లో సర్వింగ్ విధానమే ఓ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా మరో అద్భతమైన వీడియో నెటిజన్లతో పంచుకున్నారు. ఆ వీడియోలో గాల్వియర్ మహారాజ్ ప్యాలెస్‌లో ఆహారం సర్వింగ్ చేసే విధానం కనిపిస్తుంది. ఆ ప్యాలెస్‌లో బోజనం వడ్డించే పద్ధతి చాలా వెరైటీగా ఉంది. ఓ పెద్ద టేబుల్‌పై ట్రైయిన్ టాయ్‌లా ఉండే పట్టాల మధ్యలో వివిధరకాల పదార్థాల పాత్రాలను చక్కగా ఉంచారు. మరోవైపు ఆ పట్టాలపై నడుస్తున్న ట్రైయిన్ టాయ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.ఆ ట్రైయిన్ బోగిలపై గాల్వియర్ మహారాజ్ సింథియా పేరుకి సంబంధించినఅక్షరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ ట్రైయిన్ టాయ్ పట్టాల మధ్య ఉన్న ఒక్కో ఆహార పదార్థం వద్దకు చకచక వస్తుంటుంది. అందుకు సంబంధించిన వీడియోకి "మహారాజ్ ప్యాలెస్‌లో ఆహారం ఎలా వడ్డిస్తారు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ నెట్టింట షేర్ చేశారు హర్ష్ గోయెంకా. మీరు కూడా ఓ లుక్కేయండి.How food is served at Maharaja of Gwalior’s palace! pic.twitter.com/AGaYkj6PyG— Harsh Goenka (@hvgoenka) March 31, 2024 -
నిరాశొద్దు..
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసినంత మాత్రాన నిరాశ, నిస్పృహలకు లోను కావద్దని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఓటమిపై ఇక్కడి ప్యాలెస్ గ్రౌండ్లో శనివారం ప్రారంభమైన రెండు రోజుల ఆత్మావలోకనం సభలో ప్రసంగించిన నాయకులంతా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని, ఈ ఓటమి తాత్కాలికమేనని అన్నారు. సభను ప్రారంభించిన అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్రల్లో మత సామరస్యాన్ని దెబ్బ తీయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కుట్ర పన్నాయని ఆరోపించారు. ఆ కుట్రలను భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ వారు సోషల్ సైట్లను విస్తృతంగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనికి ప్రతిగా మన కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. పాదయాత్రల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే, ప్రజాందోళనలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సవాలుగా స్వీకరించాలి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని సవాలుగా స్వీకరించాలని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చురుకుగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని, పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలకు సరైన పదవులు ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఎన్నో ఆశలు రేపి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గత నెలగా ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్నీ చేపట్టలేదని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించే ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. ఆయన నుంచి ఉత్తమ పాలనను ఆశించలేమని అన్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలీ, కేహెచ్. మునియప్ప, జనార్దన పూజారి సహా రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పరమేశ్వరకు మద్దతుగా ధర్నా పరమేశ్వరకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తుమకూరు జిల్లా కొరటగెరె నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇక్కడి క్వీన్స్ రోడ్డులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. 30 ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్న పరమేశ్వరకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఆయనే కారణమంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం కొరటగెరె నియోజక వర్గంలో ఒక్క పనీ జరగడం లేదని వారు ఆరోపించారు. కాగా గత శాసన సభ ఎన్నికల్లో పరమేశ్వర ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
మంత్రి ఆంజనేయకు సీఎం క్లాస్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం క్లాస్ తీసుకున్నారు. ఇక్కడి ప్యాలెస్ మైదానంలో సోమవారం జరిగిన కేపీసీసీ ఎస్సీ, ఎస్టీ విభాగం సమావేశంలో తారస పడిన ఆంజనేయను చూసిన సీఎం తొలుత అసహనం వ్యక్తం చేశారు. విధాన సౌధలోని తన కార్యాలయం కోసం కేటాయించిన రెండు గదుల మధ్య ఉన్న గోడను ఆంజనేయ పట్టుబట్టి కూల్చి వేయించారు. దీనిపై కొంత వివాదం నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం ఆయనను సుతిమెత్తగా మందలించారు. గోడ కొట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా శాఖా పరమైన పనులను పూర్తి చేయాలని సూచించారు. కాగా విధాన సౌధలో 340, 340ఏ గదులను ఆంజనేయకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ రెండు గదుల మధ్య గోడను కూల్చాలని రహదారులు, భవనాల శాఖ (ఆర్ అడ్ బీ)ను ఆదేశించిన మంత్రి, అప్పటి వరకు వేరే గదిలో తాత్కాలింగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొన్న మంత్రి వర్గంలో చేరిన విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ తనకూ అదే 340 గది కావాలని పట్టుబట్టారు. దీనిపై ఆంజనేయ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గోడ కొట్టే పనులను త్వరగా పూర్తి చేయనందుకు ఆర్ అండ్ బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు కొట్టకపోతే నేనే దగ్గరుండి కూల్చి వేయిస్తా, ఎవరొచ్చి అడ్డుకుంటారో చూస్తా’ అని అధికారులను కస్సు బుస్సుమంటూనే పరోక్షంగా శివకుమార్‌పై చిందులేశారు. అయితే ప్యాలెస్ మైదానంలో సమావేశం సందర్భంగా వీరిద్దరూ పక్క పక్కనే కూర్చుని చిరు నవ్వులు చిందించారు. కాంగ్రెస్ మార్కు రాజకీయమంటే ఇదేనేమో...! -
బీజేపీ పథకాలను రద్దు చేయడమేకాంగ్రెస్ లక్ష్యం
కర్ణాటక ప్రభుత్వంపై నరేంద్రమోడీ విమర్శ = కన్నడలో ప్రసంగాన్ని ప్రారంభించిన ‘నమో’ = ఐటీ రంగంలో బెంగళూరు దేశానికే తలమానికం = ‘నమో’ ప్రసంగంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం సాక్షి, బెంగళూరు: గతంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా సంక్షేమ పథకాలను, నిర్ణయాలను రద్దు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోహత్యా నిషేధ బిల్లును పక్కన పెట్టడమే ఇందుకు తార్కాణమని పేర్కొన్నారు. ఇదంతా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో న గరంలోని ప్యాలెస్ గ్రౌండ్లో ‘భారత గెల్లిసి’(భారత్‌ను గెలిపించండి) పేరిట ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో నరేంద్రమోడీ పాల్గొన్నారు. నరేంద్రమోడీ తన ప్రసంగాన్ని ‘నిమగెల్లా నన్న నమస్కారగళు (మీకందరికీ నా నమస్కారాలు)’ అంటూ కన్నడలో ప్రారంభించారు. మోడి కన్నడలో మాట్లాడగానే సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఇక తన ప్రసంగం ప్రారంభంలోనే బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ, కనకదాసు, బసవేశ్వర, కిత్తూరు రాణి చెన్నమ్మల పేర్లను మోడీ ప్రస్తావించారు. అంతేకాదు శనివారం భారత రత్నకు ఎంపికైన ప్రొఫెసర్ సి.ఎన్.రావు, క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లకు నరేంద్రమోడీ తన శుభాకాంక్షలను తెలియజేశారు. బెంగళూరు నగరం ఐటీ రంగంలో భారతదేశానికే తలమానికంగా నిలిచిందని ప్రశంసించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఐటీ, పరిశోధనల రంగానికి ఎక్కువగా ప్రాముఖ్యాన్ని ఇచ్చిందని, అందుకే ఇప్పుడు ఇస్రో ‘మంగళయాన్’ వంటి గొప్ప మైలురాయిని చేరుకోగలిగిందని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థ ఉందని అయితే ఇంజనీర్స్, టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగుల కొరత కారణంగా రైల్వేలు సామాన్య ప్రజలకు మెరుగైన సేవలను అందించలేక పోతున్నాయని పేర్కొన్నారు. భారతదేశంలోని నాలుగు ముఖ్య ప్రాంతాల్లో నాలుగు యూనివర్సిటీలను రైల్వేల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసి ఇందులో రైల్వేలకు అవసరమైన ఇంజనీరింగ్, టెక్నికల్ విభాగాల్లో యువతకు శిక్షణ ఇస్తే నిరుద్యోగాన్ని పారదోలడంతో పాటు రైల్వేల పనితీరును కూడా మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అయితే రైల్వేలను కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటోందని, ఏ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుంటే ఆ ప్రాంతం వారికి రైల్వేలైన్లను, రైల్వే కోచ్‌ల తయారీ కర్మాగారాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఓట్లను దండుకుంటోందని మోడీ విమర్శించారు. ఇక ‘పింక్ రెవల్యూషన్’ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మీట్ ఎక్స్పోర్ట్’పై న రేంద్రమోడీ విరుచుకుపడ్డారు. దేశ సంపదను పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ తరహా విధానాలను అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. మాంసం దుకాణాలకు సబ్సిడీలు, ఇన్సెంటివ్‌లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం ఐటీ రంగానికి ఎందుకు ప్రోత్సాహకాలు ఇవ్వలేకపోతోందని మోడీ ప్రశ్నించారు. రోజుకు రూ.26 సంపాదించే వారు పేదవారు కాదని కేంద్ర ప్రభుత్వం అంటోందని, ఇది పూర్తిగా పేదవారిని అవమానించడమే అవుతుందన్నారు. ప్రస్తుతం రూ.26కి 300గ్రాముల ఉల్లిపాయలు కూడా రావని, మరి ఒక కుటుంబం మొత్తం కడుపునిండా ఎలా భోజనం చేయగలుగుతుందని ప్రశ్నించారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడపగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. పొగతో భయాందోళనలు... : ఆదివారం జరిగిన ‘భారత గెల్లిసి’ సభలో పొగ కనిపించడంతో సభికుల్లో భయాందోళనలు చెలరేగాయి. ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన ‘భారత గెల్లిసి’ సభా వేదిక పైకి నరేంద్రమోడీ చేరుకొని కూర్చోగానే వేదిక ఎడమవైపు ఉన్న గోడ పక్క నుంచి నల్లని పొగ రావడం కనిపించింది. ఆ పొగ ఏమిటోనని, అసలు అక్కడ ఏం జరిగిందని సభికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అయితే ఆ పొగ అక్కడున్న జనరేటర్‌ను ఆన్ చేయడం వల్ల వచ్చింది మాత్రమేనని తెలియడంతో సభికులు ఊపిరి పీల్చుకున్నారు. సభా స్థలి మొత్తం ‘నమో జపం’... : ఇక మోడీ ప్రసంగానికి సభకు హాజరైన వారి నుంచి విశేష స్పందన లభించింది. సభా ప్రాంగణంలో నరేంద్రమోడీ హెలికాఫ్టర్ ల్యాండ్ కాగానే సభలోని కార్యకర్తలందరూ ‘మోడీ మోడీ’అంటూ నినాదాలు చేశారు. ఇక నరేంద్రమోడీ సభ ప్రవేశ రుసుముగా రూ.10 వసూలు చేసిన విషయం తెలిసిందే. ప్రవేశ రుసుముగా వసూలు చేసిన ధనం రూ.35 లక్షల నగదును ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏకతా ట్రస్ట్’కు అందజేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జోషి వెల్లడించారు. -
భవన నిర్మాణ కార్మికులకు వరాల జల్లు
సాక్షి,బెంగళూరు: భవన నిర్మాణ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్యాలెస్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కార్మికశాఖ మంత్రి పరమేశ్వర్‌నాయక్ కార్మికుల కోసం త్వరలో ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలను వెల్లడించారు. మొదట ముఖ్యమంత్రి సిద్ధరావ ుయ్య మాట్లాడుతూ... నిర్మాణ రంగంలో మెళకువలపై శిక్షణ ఇవ్వడానికి వీలుగా రాష్ట్రంలో రూ.200 కోట్ల ఖర్చుతో కన్స్ట్రక్షన్ అకాడమి ఏర్పాటు చేయనున్నామన్నారు. నిర్మాణరంగంలోని కార్మికుల పిల్లల కోసం రూ.250 కోట్ల వ్యయంతో బెంగళూరు, హుబ్లీతో సహా రాష్ట్రంలో ఐదు చోట్ల హాస్టల్ సౌకర్యం ఉన్న పాఠశాలలను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఈ రంగంలోని వారి కోసం ఉపయోగపడేలా ప్రత్యేకంగా బీబీఎంపీ పరిధిలో రూ.24 కోట్ల వ్యయంతో నాలుగు... ప్రతి జిల్లా కేంద్రంలో రూ.3 కోట్ల వ్యయంతో ఒక్కొక్క కల్యాణ వ ుంటపాలను నిర్మించనున్నామన్నారు. అనంతరం ఇదే వేదికపై ఉన్న మంత్రి పరమేశ్వర్ నాయక్ మాట్లాడుతూ... నిర్మాణ రంగంలోని మహిళలకు రూ.15 వేల ప్రసూతి భత్యాన్ని కల్పించే ఆలోచన కూడా ప్రభుత్వం వద్ద ఉందన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలో పూర్తి కానున్నాయన్నారు. ఇకపై నిర్మాణ రంగంలోని కార్మికుల పిల్లలు ఇంజినీరింగ్, వైద్యవిద్య తదితర వృత్తివిద్యా కోర్సుల్లో పీజీ కోర్సు చదువుతుంటే నెలకు రూ.2 వేల ఉపకార వేతనాన్ని ఇవ్వనున్నామని తెలిపారు. నిర్మాణ సమయంలో కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పరిహారాన్ని ఇవ ్వనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి జార్జ్, కార్మికశాఖ విభాగం అధ్యక్షుడు ఎస్.ఎస్ ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.