భారీ ఎత్తున అక్రమ ఆయుధాలు స్వాధీనం | Delhi: Massive arms haul busted, guns and bullets seized | Sakshi
Sakshi News home page

భారీ ఎత్తున అక్రమ ఆయుధాలు స్వాధీనం

Published Mon, Mar 23 2015 9:41 PM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

Delhi: Massive arms haul busted, guns and bullets seized

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సోమవారం సరాయ్‌కాలే ఖాన్‌లో ముగ్గురు ఆయుధ స్మగ్లర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 1,800  కాట్రిడ్జ్‌లు, 9 డబుల్ బ్యారెల్ తుపాకులు, రెండు  సింగిల్ బ్యారెల్ తుపాకులను స్వాధీనపరచుకున్నారు. అక్రమ ఆయుధాల గురించి సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ డీసీపీ సంజీవ్ యాదవ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం నిందితులపై దాడి చేసింది. అక్రమ ఆయుధాల రాక గురించి అందిన సమాచారం ఆధారంగా వలపన్ని ముగ్గురిని అరెస్టు చేసినట్లు స్పెషల్ సెల్ కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఈ ఆయుధాలను నిందితుల నుంచి తీసుకోవాల్సిన వారిని పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఆయుధాలను అందించడానికి వచ్చిన నిందితులు మాత్రమే పోలీసుల చేతికి చిక్కారు. ఈ స్థాయిలో ఆయుధాలు పోలీసులకు దొరకడం ఈ ఏడాదిలో రెండోసారి. గతంలో కూడా 900 కాట్రిడ్జ్‌లతో పాటు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement