
ఆక్రమణల కూల్చివేత షురూ
హొస్పేట : స్థానిక రామటాకీస్ సర్కిల్ నుంచి వాల్మీకి సర్కిల్ వరకు రోడ్డు వెడల్పు పనులలో భాగంగా ఆక్రమణల తొలగింపును నగర సభ యంత్రాంగం మంగళవారం ప్రారంభించింది.
ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపుల ఉన్నా అక్రమ కట్టడాలు, భవనాలను జేసీబీ యంత్రాలతో తొలగించే పనుల్లో అధికారులు నిమగ్నులయ్యారు. మరి కొందరు స్వయంగా నగర సభ యంత్రాంగం వేసిన కొలత(మార్కింగ్) వరకు ఇళ్లను పగులగొట్టే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.