
కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయం
హైదరాబాద్: నిజాంపేటలో కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక రాజీవ్‌గాంధీ నగర్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్న కొందరి ఇళ్లపై శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 4 బ్యాగుల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు మత్తు పదార్థాలను దొంగచాటుగా కొనుగోలు చేసి, వాటిని విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.