ఇళయరాజాకు తొలి సెల్యూట్ | first salute to ilayaraja | Sakshi
Sakshi News home page

ఇళయరాజాకు తొలి సెల్యూట్

Published Sat, Mar 12 2016 8:43 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

ఇళయరాజాకు తొలి సెల్యూట్

ఇళయరాజాకు తొలి సెల్యూట్

చెన్నై : సంగీత రారాజు ఇళయరాజాకు తొలి సెల్యూట్ చేసే కార్యక్రమం శనివారం చెన్నైలో జరగనుంది. సహస్ర చిత్రాలకు సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు బహుశ భారతదేశంలోనే ఇసైజ్ఞాని ఇళయరాజా ఒక్కరే అయ్యి ఉంటారు. ఇది ఒక చరిత్ర అని పేర్కొనవచ్చు.
 
అలాంటి సంగీతరాజాకు సెల్యూట్ చెప్పే విధంగా వంద మంది ప్రముఖ చిత్ర కళాకారులు ఆయన సంగీతం నోట్స్‌కు రూపం ఇస్తూ గీసిన చిత్రలేఖనాల ప్రదర్శన కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక నుంగమ్‌బాక్కమ్‌లోని లయోలా కళాశాలలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఇళయరాజాతో పాటు నటుడు విజయ్‌సేతుపతి, నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్, పొన్‌వన్నన్, దర్శకుడు ఎస్పీ జననాథన్,కదిర్, పా.రంజిత్ పాల్గొననున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement