అక్రమ కట్టడాలపై కొరడా
- తొలగించిన మహానగర పాలికె
- శ్రీకనక దుర్గమ్మ ఆలయ సమీపంలో 15కు పైగా షెడ్ల కూల్చివేత
సాక్షి, బళ్లారి : బళ్లారి నగరంలోని శ్రీకనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని అక్రమ షెడ్లు, డబ్బా అంగళ్లను మహానగర పాలికె అధికారులు శనివారం తొలగించారు. కార్పొరేషన్ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్లు నిర్మించుకున్నందుకు వాటిని తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహానగర పాలికె ఈఈ తిమ్మప్ప నేతృత్వంలో పలువురు అధికారులు శనివారం అక్రమ కట్టడాలు, షెడ్లను తొలగించారు. అలాగే నగరంలోని మోతీ సర్కిల్ సమీపంలోని జిల్లా పంచాయతీ కార్యాలయానికి వెళ్లే రహదారిలో నిర్మిస్తున్న ఆర్‌సీసీ బిల్డింగ్‌ను నేతృత్వంలో తొలగించారు.
ఈ సందర్భంగా బాధితులు ఆందోళన చేశారు. కట్టడాన్ని కూల్చకూడదని విజ్ఞప్తి చేశారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టినందుకు తాము తొలగిస్తున్నట్లు సంబంధిత అధికారి పేర్కొన్నారు. బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ రోడ్డు గుండా అక్రమంగా మేదార్లు నిర్మించుకున్న వెంటనే తొలగించాలని సూచించారు.
లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న నూతన బిల్డింగ్‌ను కూల్చివేయడంతో ఇంటి యజమానులు నిరసన వ్యక్తం చేశారు.