సమస్యలపై ఆమె బాగా స్పందిస్తారు: కేటీఆర్‌ | foreign-community-conference in HICC | Sakshi
Sakshi News home page

సమస్యలపై ఆమె బాగా స్పందిస్తారు: కేటీఆర్‌

Published Sat, May 13 2017 12:44 PM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

సమస్యలపై ఆమె బాగా స్పందిస్తారు: కేటీఆర్‌ - Sakshi

సమస్యలపై ఆమె బాగా స్పందిస్తారు: కేటీఆర్‌

కేంద్రమంత్రిగా సుష్మాస్వరాజ్‌ బాధ్యతలు చేపట్టాక విదేశాల్లో ఉంటున్న లక్షలమంది భద్రంగా ఉంటున్నారని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

హైదరాబాద్‌: కేంద్రమంత్రిగా సుష్మాస్వరాజ్‌ బాధ్యతలు చేపట్టాక విదేశాల్లో ఉంటున్న లక్షలమంది భద్రంగా ఉంటున్నారని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒక్క ట్వీట్‌తో ఆమెకు తమ సమస్యలను చెప్పుకొనే అవకాశం కల్పించారని.. సమస్యలపై ఆమె బాగా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు. హెచ్ఐసీసీలో విదేశీ సంపర్క్ సదస్సును శనివారం కేంద్రమంతి వీకేసింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రసంగించారు. అనంతరం కేంద్ర మంత్రి వీకే సింగ్‌ మాట్లాడుతూ విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారిని స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చాలా మంది ఇక్కడ కంటే విదేశాల్లోనే ఉండటానికి మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఈ సందస్సులో ప్రవాసభారతీయుల పాస్‌పోర్టు సమస్యలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement