యూపీఎస్సీ సభ్యుడిగా బీఎస్ బస్సీ | Former Delhi police chief B S Bassi appointed UPSC member | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ సభ్యుడిగా బీఎస్ బస్సీ

Published Tue, May 31 2016 5:21 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

యూపీఎస్సీ సభ్యుడిగా బీఎస్ బస్సీ

యూపీఎస్సీ సభ్యుడిగా బీఎస్ బస్సీ

న్యూఢిల్లీ: ఢిల్లీ వివాదాస్పద మాజీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సభ్యుడిగా మంగళవారం నియమించారు. 2021 ఫిబ్రవరి వరకు అంటే ఐదేళ్ల పాటు బస్సీ ఈ పదవిలో కొనసాగనున్నారు. యూపీఎస్సీ చైర్మన్తో పాటు 10 మంది సభ్యులుంటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఆలిండియా సర్వీసుల ఉద్యోగాలను యూపీఎస్సీ భర్తీ చేస్తుంది.

1977 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన బస్సీ (60) ఈ ఏడాడి ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీస్ చీఫ్‌గా రిటైరయ్యారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్గా బస్సీ పదవీకాలంలో పలు విమర్శలు వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ సర్కార్తో ఘర్షణాత్మక వైఖరి అవలంభించారన్న ఆరోపణలు వచ్చాయి. బస్సీ పదవీకాలంలోనే జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ను దేశద్రోహం కేసులో అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement